తాడేపల్లిగూడెం : ఫిబ్రవరి 17
పార్వతీపురం, మన్యం జిల్లా, మక్కువ మండల ప్రజాశక్తి విలేకరి మల్యాడ రామారావుపై దాడికి పాల్పడిన ఆ మండల టిడిపి అధ్యక్షులు, ఎ.వెంకంపేట గ్రామానికి చెందిన గుల్ల వేణుగోపాలనాయుడు అతని అనుచరులపై చట్టపరమైన చర్యలు
తీసుకోవాలని కోరుతూ తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ తరఫున తాడేపల్లిగూడెం తహశీల్దార్ ఎం. సునీల్ కుమార్ కు సోమవారం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజే అనుబంధం తాడేపల్లిగూడెం జర్నలిస్టు వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రంగ సురేష్ మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండల ప్రజాశక్తి విలేఖరి మల్యాడ రామారావుపై జరిగిన దాడి అమానుషమని తీవ్ర స్థాయిలో ఖండించారు. రాష్ట్రంలో ఇటీవల విలేకరులపై రాజకీయ నాయకులు దాడులు పెరిగిపోతున్నాయని, వాటిని అరికట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇకముందు రాష్ట్రంలో విలేకరులపై ఎక్కడ దాడులు జరిగిన తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తూ ధర్నాలు చేపడతామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తమ్మిశెట్టి రంగ సురేష్ తో పాటుగా కోశాధికారి శీలి రాజు, ప్రెస్ క్లబ్ సభ్యులు వీర్రాజు, వానపల్లి పుండరీకాక్షుడు, దేవ శివప్రసాద్, జిఎం.రాజు, ఊస.దుర్గారావు, టి.చందు తదితరులు పాల్గొన్నారు.
