LIC ఏజెంట్ల కమిషన్ తగ్గింపు నిర్ణయాన్ని ఉపసంహరించాలి.
తాడేపల్లిగూడెం, అక్టోబరు28:
భారతీయ జీవిత బీమా సంస్థ ఏజెంట్ల కమిషన్ తగ్గించాలనే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఎల్.ఐ.సి.ఏజెంట్ల అసోసియేషన్ డిమాండ్ చేసింది.స్థానిక జీవిత బీమా కార్యాలయం వద్ద ఏజెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు పొత్తూరి సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ ఎల్.ఐ.సి.ఏజెంట్ల జీవనాధారమైన కమీషన్ ను తగ్గించటం అన్యాయమని ఈ నిర్ణయాన్ని ఎల్.ఐ.సి.యాజమాన్యం వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. కొత్త పాలసీ లపై ప్రీమియం తగ్గించాలని, బోనస్ పెంచాలని, జి.ఎస్.టి తొలగించాలని కోరారు. 1956నుంచి అనుసరిస్తున్న కమిషన్ విధానాలను కొనసాగించాలని, తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ఆయన కోరారు. ఈ నిరసన కార్యక్రమం లో అసోసియేషన్ డివిజినల్ కార్యదర్శి నాగబాబు, డివిజినల్ ఇ.సి.సభ్యులు సంకు వెంకటేశ్వర రావు, గూడెం యూనియన్ కార్యదర్శి పి.వి.సూర్యచంద్ర రావు, కోశాధికారి వి. శ్రీనివాస్, పెద్ద సంఖ్య లో ఏజెంట్లు పాల్గొన్నారు.

previous post