పెంటపాడు: పెంటపాడు కూనగర పేట కు చెందిన వైసీపీ నాయకుడు ఉండ్రాజవరపు గోపి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో చికిత్స పొంది తరువాత తాడేపల్లిగూడెం ట్రినిటీ హాస్పటల్ చికిత్స పొంది గత ఐదు నెలల నుండి మంచానపడి తీవ్ర అనారోగ్యంతో ఉన్న
వైసిపి నాయకుడు ఉండ్రాజవరపు గోపికి వైసీపీ నాయకులు తమ వంతు సహకారాన్ని అందించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రియ శీలకంగా వ్యవహరిస్తూ పార్టీలో సురుకైన నాయకుడిగా పార్టీకి సేవలు అందించారు. హాస్పటల్ పాలై ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. ఆర్థికంగా చితికి పోయి చికిత్స చేయించుకోవడానికి ఇబ్బంది పడుతున్న విషయాన్ని వార్డు సభ్యులు మారంపూడి ఏసుదాసు స్థానిక వైసీపీ నాయకులు దృష్టికి తీసుకువెళ్లారు. దీనికి స్పందించిన నాయకులు వారి వంతు సహకారాన్ని అందించి బాధితునికి మేమున్నామంటూ భరోసాని కల్పించారు. పెంటపాడు గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ కొవ్వూరి ప్రసాద్ రెడ్డి( 10,000/-), ఎంపీటీసీ రెడ్డి సూరిబాబు(5000/-), తాడేపల్లిగూడెం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ జామి కృష్ణ (5000/-), పంచాయతీ వార్డు సభ్యులు బర్ల జయ బాబు(5000/-), వైసీపీ నాయకులు బండారు రాంబాబు (5000/-) తమ వంతు సహకారాన్ని అందించి మేమున్నామంటూ భరోసా కల్పించినందుకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆర్థిక సహకారం అందించిన వైసిపి నాయకులకు కుటుంబ సభ్యులు మరియు కునాగర పేట వైసీపీ నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు. వీరిని పలువురు గ్రామ నాయకులు అభినందించారు.
