స్వచ్ఛ భారత్ కు పునాది పారిశుధ్య కార్మికులు
పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం స్వచ్ఛ తా హి సేవ-2024 కార్యక్రమాలలో భాగంగా పెనుగొండ మండలం వడలి గ్రామపంచాయతీ వద్ద గ్రామపంచాయతీ సర్పంచ్ శ్రీమతి కాసాని విజయలక్ష్మి ఆధ్వర్యంలో పంచాయతీ పారిశుధ్య కార్మికులను శాలువాలు , పండ్లు ఇచ్చి సన్మానించడం జరిగినది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ ఉప్పలపాటి చంటి మాట్లాడుతూ….
పారిశుద్ధ్య నిర్వహణలో ఏ గ్రామం అయితే ముందంజలో ఉంటుందో ఆ గ్రామం ఎప్పుడూ అభివృద్ధి పదంలో కొనసాగుతుందని ..పారిశుధ్య కార్మికులు ఆరోగ్యంగా ఉంటే ప్రజల ఆరోగ్యంగా ఉంటారని, వారిని మనం గౌరవించాలని తెలియచేస్తూ వారికి స్వీట్స్ ను ఇచ్చి అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి శ్రీ P.A. రామకృష్ణ మాట్లాడుతూ స్వచ్ఛభారత్ కు మూలకారణం పారిశుద్ధ్య కార్మికులని తెలియజేసి, స్వచ్ఛభారత్ ప్రాధాన్యతను వివరించడం జరిగినది.ఈ కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గ సభ్యులు శ్రీ మేకా శివయ్య , నాయకులు శ్రీ గణపతినీడి బుల్లియ , పంచాయతీ సిబ్బంది, సచివాలయం సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది,ఆరోగ్య సిబ్బంది పాల్గొనడం జరిగింది.