March 14, 2025
Artelugunews.in | Telugu News App
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh: ప్రసిద్ధ గండి వీరాంజనేయస్వామికి విశేష మాలను బహుకరించిన భక్తుడు..

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

ప్రముఖ పుణ్యక్షేత్రం రాయలసీమ జిల్లాల్లోనే అతిపెద్ద ఆంజనేయస్వామి దేవాలయం గండి వీరాంజనేయ స్వామికి ఓ భక్తుడు వెండి తమలపాకుల దండను బహుకరించారు. 54 తమలపాకులతో కూడిన సుమారు 540 గ్రాముల వెండితో ఈ దండను భక్తుడు స్వామివారికి సమర్పించారు.

కడప జిల్లాలోని వేంపల్లి మండలంలో గల ప్రముఖ పుణ్యక్షేత్రం గండి వీరాంజనేయ స్వామికి భక్తుడు వెండి తమలపాకుల దండను బహుకరించారు. ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన భక్తుడు 54 వెండి తమలపాకులతో కూడిన వెండి దండను వీరాంజనేయ స్వామికి బహుకరించారు. భక్తుల కోరికలను అనుకున్న విధంగా తీర్చే గండి వీరాంజనేయ స్వామికి ప్రత్యేక విశిష్టత ఉంది. ప్రతి మంగళవారం, శనివారాలతో పాటు శ్రావణమాసంలో వీరాంజనేయ స్వామికి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి.

రాయలసీమ ప్రాంతంలో అతిపెద్ద దేవాలయంగా పేరు ఉన్న గండి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది ఆంజనేయ స్వామి భక్తులు చాలామంది ఇక్కడకు వచ్చి తమ తీరని కోర్కెలను స్వామి వద్ద మొక్కుకుని వాటిని తీర్చుకుంటూ ఉంటారని గట్టి నమ్మకం ఉంది. రాయలసీమ ప్రాంతంలోనే కాక ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో గండి వీరాంజనేయ స్వామికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. అందులో భాగంగానే ప్రొద్దుటూరుకు చెందిన భక్తులు వారి కోర్కెలు తీరడంతో స్వామివారికి 54 వెండి తమలపాకులతో కూడిన దండను బహూకరించారు. ఈ వెండి మాలను ఆలయ అసిస్టెంట్ కమిషనర్‌కు అందజేశారు. వెండి తమలపాకుల దండను సమర్పించిన భక్తులకు వేద పండితుల ఆశీర్వచనాలు అందజేశారు.

Related posts

నామినేటెడ్ పదవి కల్పించండి సీఎం తో పాటు మంత్రులను కలిసిన వారా రాజశేఖర్

AR TELUGU NEWS

జగన్ కు చంద్రబాబు సర్కార్ షాక్

AR TELUGU NEWS

Water Melon : పుచ్చకాయ తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుందా..? ఆశ్చర్యకరమైన విషయాలు.!

AR TELUGU NEWS