March 10, 2025
Artelugunews.in | Telugu News App
తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

రజక ఫెడరేషన్ చైర్మన్ పదవి కాకినాడ రామారావుకు ఇవ్వాలి

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

తాడేపల్లిగూడెం ఆగస్టు 8:రజక ఫెడరేషన్ చైర్మన్ పదవి కాకినాడ రామారావుకు ఇవ్వాలని అఖిల భారత ధోబి మహా సంఘం రాష్ట్ర కార్యదర్శి జొన్నాడ శ్రీనివాస్ , రజక చైతన్య సేవా సంస్థ జిల్లా కన్వీనర్
ఊనగట్ల నాగ పోసి కృష్ణ అన్నారు. రాష్ట్ర పర్యటన లో భాగంగా లో కాకినాడ రామారావు గురువారం తాడేపల్లిగూడెం వచ్చారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జొన్నాడ శ్రీనివాస్ మాట్లాడుతూ కాకినాడ రామారావు గత 45 సంవత్సరాలుగా టీడీపీ పార్టీలో ఉంటూ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారన్నారు. పార్టీ ఆయనను గుర్తించి టిడిపి రాష్ట్ర కార్యదర్శిగాను, రామచంద్రపురం నియోజకవర్గం పరిశీలకులు నియమించడం జరిగిందన్నారు. అదేవిధంగా పార్టీకే కాకుండా వారి కుటుంబం రాష్ట్రంలో రజకులకు సేవలు అందించారన్నారు. కావున రాష్ట్ర ఫెడరేషన్ చైర్మన్ పదవి కాకినాడ రామారావు ను నామినేట్ చేయాలని
రాష్ట్ర రజక సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో కొట్టిచుక్కల రాము, వెల్దుటి శ్రీనివాస్, పొలామూరి అన్నవరం, అంజూరి శ్రీనివాస్, పిప్పర ప్రసాద్,రేజర్ల భద్రాచలం పాల్గొన్నారు.

Related posts

తాడేపల్లిగూడెంలో అట్టహాసంగా నారాయణ విద్యాసంస్థల ప్రీమియర్ లీగ్

AR TELUGU NEWS

పేదల లోగిళ్ళలో సందడి..పింఛనుదారుల ముఖాల్లో సంతోషం – తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి

AR TELUGU NEWS

జర్నలిస్టులకు ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుంది 3F డైరెక్టర్ ఓపీ గొయంక

AR TELUGU NEWS