ఎమ్మార్వో ను కలిసిన సిపిఐ నాయకులు
పెంటపాడు :ఆగష్టు 7
పెంటపాడు మండలం నూతన తహసీల్దార్ ఏడిద శ్రీనివాస్ ను సిపిఐ నాయకులు కళింగ లక్ష్మణరావు,ఏపీ రైతు సంఘం నాయకులు బండారు శ్రీనివాసరావు, డప్పు కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు దిద్దే నాగేశ్వరరావు, యువజన నాయకులు నంబూరి చంద్రశేఖర్ లు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నిష్పక్షపాతంగా ప్రజలందరికీ సమాన ప్రాతిపదికను పనిచేయాలని కళింగ లక్ష్మణరావు కోరారు.ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాస్ మాట్లాడుతూ రాజకీయ వివక్ష లేకుండా ప్రజాసేవకే తనవంతు సహకారం అందిస్తానని, ప్రజలకు,విద్యార్థులకు,అధికారులకు అందుబాటులో ఉంటూ,సమస్యల తక్షణ పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.