మావుళ్ళమ్మ అమ్మవారి స్వర్ణ వస్త్రానికి సహకరించండి
* ఇప్పటికే 80 శాతం పూర్తి .. రెండేళ్లల్లోనే పూర్తి చేద్దాం
* ఛాంబర్ అధ్యక్షులు రాంపండును సత్కరించిన ఎమ్మెల్యే అంజిబాబు
భీమవరం జులై 17 :
భీమవరం ఇలవేల్పు అయిన శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి స్వర్ణ వస్త్రానికి అందరి సహకారం ఎంతో అవసరమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. భీమవరం బోండాడ వారి విడిది విల్లులో ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన బోండాడ రామ్మోహన్ రావు (రాంపండు)ను బోండాడ వెల్పెర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ ఇప్పటికే మావుళ్ళమ్మ అమ్మవారికి 80 శాతం వరకు స్వర్ణ వస్త్రం పూర్తి అయ్యిందని, మిగిలిన భాగాన్ని రెండేళ్లల్లోనే పూర్తి చేద్దామని, దీనికి మీరంతా సహకరించాలని అన్నారు. భీమవరం ఎంతో అభివృద్ధి చెందుతుందని, పనులను కూడా వేగవంతంగా చేస్తున్నామని అన్నారు. మెట్రో సిటీలకు దీటుగా భీమవరాన్ని అభివృద్ధి చేస్తామని అంన్నారు. ఛాంబర్ అధ్యక్షులు రాంపండు మాట్లాడుతూ దాతలను సమీకరించి ఏడాదిన్నార లోపే అమ్మవారి స్వర్ణ వస్త్రాన్ని పూర్తి చేస్తామని అన్నారు. బొండాడ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు బొండాడ సుబ్బారావు, కుమార వెంకటరత్నం మాట్లాడుతూ భీమవరం అభివృద్ధికి మా వెల్పేర్ అసోసియేషన్ ఎల్లప్పుడూ ముందుండి సహకారం అందిస్తుందని అన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ కోశాధికారి వినయ్, సభ్యులు బంగార్రాజు, మాణిక్యం గుప్తా, వెంకన్న గుప్తా, నాగభూషణం, వెంకటేశ్వరరావు, శ్రీనాథ్, విశ్వనాథం, జనసేన జిల్లా అధ్యక్షుడు కోటికలపూడి గోవిందరావు పట్టణ అధ్యక్షులు చెన్నమల చంద్రశేఖర్, వబిలిశెట్టి రామకృష్ణ, ఏఎంసి మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, భీమాల శ్రీరామూర్తి తదితరులు పాల్గొన్నారు.