- జనసేన నాలుగో విడత సభ్యత
కార్యక్రమం
పెనుగొండ జులై 17 :
పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్త క్రియాశీలక సభ్యత్వ నమోదు చేసుకోవడం ద్వారా ఆపదలో భరోసాగా ఉపయోగపడుతుందని జనసేన పెనుగొండ మండలం అధ్యక్షుడు కొండవీటి శ్రీనివాస్ అన్నారు.
జనసేన పార్టీ నాలుగో విడత క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం నియోజవర్గ స్థాయిలో పెనుగొండలో ఏర్పాటు చేశారు . రాష్ట్రవ్యాప్తంగా ఈనెల జూలై 18 వ తారీకు నుండి 28వ తారీకు వరకు పది రోజుల పాటు ఈ నమోదు ప్రక్రియ జరుగును అని జనసేన పార్టీ పెనుమంట్ర మండల అధ్యక్షులు కోయ వెంకట్ కార్తీక్ తెలియజేశారు. ఆచంట నియోజకవర్గం జనసేన పార్టీ నాలుగు మండలాల నుండి 50 మంది వాలంటీర్లతో ఈ నమోదు ప్రక్రియ జరుగుతుంది అని తెలియజేశారు మనకోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం భావితరాల భవిష్యత్తు కోసం జనసేన పార్టీ అధ్యక్షులు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కుటుంబ సభ్యులకు భరోసా కల్పించే విధంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు రూ 500 లతో క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటే ఏదైనా ప్రమాదవశాత్తు మరణించిన వారికి రూ 5 లక్షల చెక్కును అందజేసి వారి కుటుంబానికి భరోసా కల్పించడం జరుగుతుందని చెప్పారు. అలాగే ప్రమాదవశాత్తు గాయపడిన వారికి 50 వేల నుండి లక్ష రూపాయలు ఆర్థిక భరోసా కల్పించడం జరుగుతుంది ఈ ప్రమాద బీమా కింద పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్,తెలంగాణలో 344 కుటుంబాలకు రూ 18 కోట్ల అందజేయడం జరిగిందిని, వారి యొక్క కుటుంబాలకు భరోసా కల్పించడం జరిగింది కావున ఈ నెల జూలై 18 వ తారీకు నుండి 28వ తారీకు వరకు ఈ సభ్యత్వ నమోదు ప్రక్రియ చేయడం జరుగుతుంది అంతకుముందు సభ్యత్వం తీసుకున్నవారు రెన్యువల్ చేసుకోవాల్సిందిగా , కొత్తగా సభ్యత్వం తీసుకోవాల్సిన వారు తీసుకోవాల్సిందిగా జనసేన పార్టీ, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేశారు .ఆచంట నియోజవర్గ నాలుగో విడత క్రియాశీలక సభ్యత్వ సమావేశం పెనుగొండలో మండల అధ్యక్షులు కొండవీటి శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసి క్రియాశీలక సభ్యత్వం పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో క్రియాశీలక వాలంటీర్స్ ,సభ్యులు పెనుగొండ టౌన్ అధ్యక్షులు గుర్రాల సూరిబాబు, ఆచంట మండల అధ్యక్షులు జవ్వాది బాలాజీ, జిల్లా ఉపాధ్యక్షులు వెంగళదాస్ దానయ్య,జిల్లా సెక్రెటరీ చిట్టూరి శ్రీనివాస్, ఆచంట మండలం వైస్ ఎంపీపీ ఎర్రగొప్పుల నాగరాజు ,పెనుమంట్ర మండల ఉపాధ్యక్షులు షేక్ మొహమ్మద్ ఆలీ, మండల కార్యదర్శి ఆకివీటి నాగ శ్రీహరి, సంయుక్త కార్యదర్శి చిడిపి రామకృష్ణ, దేవదానం, మండల కమిటీ సభ్యులు గ్రామ కమిటీ సభ్యులు జన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.