టీచర్స్ ఫెడరేషన్ సభ్యత్వ నమోదు
భీమవరం జులై 09 :
ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ( APTF)
భీమవరం,మండల శాఖ ఆధ్వర్యంలో పలు పాఠశాలలో సభ్యత్వ నమోదు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు జి ప్రకాశం మాట్లాడుతూ, గత ప్రభుత్వం తీసుకొచ్చిన 117 జీవో వల్ల ప్రాథమిక పాఠశాలలు బలహీన పడ్డాయని, దానికోసం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అనేక ఉద్యమాలు చేసి, ఆ జీఓ ను రద్దు చేయమని కోరగా గత ప్రభుత్వం అలసత్వం వహించి ఆ జీఓ నురద్దు చేయలేదు. ఈ ప్రభుత్వం అయినా ఆ జీఓ ను రద్దుచేసి, ప్రాథమిక పాఠశాలను బతికించాలని కోరారు .అదేవిధంగా 12వ పిఆర్సి అమలకు ఆలస్యం అవుతున్నందున, ఈ లోగా మధ్యంతర భృతి ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భీమవరం మండల శాఖ అధ్యక్షులు ఐ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పి పేతురు, కార్యవర్గ సభ్యులు ఏసేబు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.