నేడు ప.గో.జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టనున్న సి.నాగరాణి.
భీమవరం జూన్ 28.
పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ గా సి.నాగరాణి నేడు జూన్ 28న శుక్రవారం భాధ్యతలు చేపట్టనున్నారు.
జిల్లాల పునర్విభజన తర్వాత తొలిసారిగా మహిళా కలెక్టర్ గా పి.ప్రశాంతి భాధ్యతలు చేపట్టారు. వీరు 4.4.2022 నుండి 17.2.2024 వరకు విధులు నిర్వర్తించారు. ప్రశాంతి బదిలీ అనంతరం జిల్లా కలెక్టర్ గా సుమిత్ కుమార్ ను నియమితులయ్యారు. 20.2.2024 నుండి విధులు నిర్వర్తించిన ఈయన ఇటీవల బదిలీల్లో చిత్తూరు జిల్లాకు కలెక్టర్ గా వెళ్లారు.
* ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ గా నియమితులైన సి.నాగరాణి తొలిసారిగా కలెక్టర్ బాధ్యతలను చేపట్టనున్నారు. ఇంతకుముందు ఐటీడీఏ, గ్రామీణ ఉపాధిహామీ, చేనేత-జౌళి, సాంకేతిక విద్య వంటి కీలక శాఖల్లో పని చేసియున్నారు. 2011 నుండి 2014 వరకు ఐటీడీఏ పీవోగాను, తర్వాత గ్రామీణ ఉపాధి హామీ పనుల డైరెక్టర్ గా విధులు నిర్వహించారు. చేనేత జౌళిశాఖ సంచాలకురాలిగా 2022 ఆగస్టు వరకు విధుల్లో ఉన్నారు. ప్రస్తుతం సాంకేతిక విద్యా విభాగానికి డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. తాజా బదిలీల్లో జిల్లా కలెక్టర్ గా వచ్చారు.