29న అన్ని కోర్ట్ లలో మెగా జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోండి – న్యాయమూర్తి పి. విజయ దుర్గా
నర్సాపురం జూన్ 25 :
ఈ నెల 29వ తేదీన నర్సాపురం లో అన్ని కోర్ట్ ల సముదాయాలలో జరుగనున్న జాతీయ లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులకు మరింత త్వరితగతిన సమ న్యాయ అందించడానికి న్యాయవాదులు తమ వంతు కృషి చేయవలసినది గా కోరుతూ స్థానిక నర్సాపురం 10వ అధనపు జిల్లా న్యాయమూర్తి పి. విజయ దుర్గా మంగళవారం బార్ అసోసియేషన్ హాల్ నందు న్యాయవాదులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అన్నారు. కొన్ని అపరిష్కృతంగా ఉన్న సివిల్ కేసులపై ప్రత్యేక శ్రద్ద వహించి మధ్యవర్తిత్వం ద్వారా కూడా ఇరుపార్టీల వారికి సమ న్యాయం అందించడానికి ఇరు పార్టీల న్యాయవాదులు సహకరించాలని, రాజీ పడతగిన క్రిమినల్ కేసులు చెక్ బౌన్స్ కేసులలో కూడా కక్షిదారులకు లోక్ అదాలత్ యొక్క ఉపయోగాన్ని తెలియజేసి గతంలో కంటే ఎక్కువ కేసులు రాజీ చేసే అయ్యేటట్లు న్యాయవాదులు అందరూతమ వంతు కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు జి. గంగ రాజు, కె. శ్రీనివాస్ న్యాయవాదుల సంఘం అధ్యక్షులు చల్లా దానయ్య నాయుడు, జనరల్ సెక్రెటరీ ఆర్.జి కుమార్, సీనియర్ జూనియర్ న్యాయవాదులు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హమీద్ ప్యానల్ లాయర్ లు పాల్గొన్నారు.