March 11, 2025
Artelugunews.in | Telugu News App
పశ్చిమగోదావరి జిల్లాభీమవరం

జాతీయ సమైక్యత ర్యాలీని ప్రారంభించిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

బాలల్లో దేశభక్తి సమైక్యత భావం కనిపించాలి
* జాతీయ సమైక్యత ర్యాలీని ప్రారంభించిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ

భీమవరం జూన్ 22:

విద్యార్థి దశ నుంచే బాలల్లో దేశభక్తి సమైక్యత భావం కనిపించాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. ఏఆర్ కేఆర్ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులతో శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సమైక్యత ర్యాలీని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ప్రారంభించి మాట్లాడారు. బండా వీర్రాజు ప్రాథమిక పాఠశాల, ఏఆర్ కేఆర్ మున్సిపల్ హైస్కూల్, కేజీఆర్ఎల్ లో ఇంటర్, డిఎన్నార్ లా చేశానని, స్కూల్లో ఎస్పీఎల్ గా ఉన్నానని, జాతీయ సమైక్యత కార్యక్రమాలను నిర్వహించడం గొప్ప విశేషమని అన్నారు. మన భారతదేశం జాతీయ సమైక్యతతోనే నడుస్తుందని, దేశ ప్రధాని మోది స్ఫూర్తితో దేశ అభివృద్ధికి సహకరించాలని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ కేంద్ర సహాయ మంత్రి వర్మ తాత భూపతిరాజు బాపిరాజు స్వతంత్ర్య సమర యోధులని, శ్రీనివాస్ వర్మ చిన్నప్పటి నుంచి విద్యార్థి సంఘ నాయకునిగా విద్యార్థి సమస్యలు తీర్చారని అన్నారు. ఇటువంటి జాతీయ సమైక్యత స్ఫూర్తి కార్యకర్తలతో విద్యార్థుల్లో చైతన్యం కలుగుతుందని అన్నారు. అనంతరం 400 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో హైస్కూల్ ప్రధానోపాధ్యయులు ఎవి సత్యనారాయణ, లయన్స్ క్లబ్ పట్టణ ఉపాధ్యక్షులు నరహరిశెట్టి కృష్ణ, కొండ్రు శ్రీనివాస్, కాగిత సురేంద్ర, అరసవల్లి సుబ్రమణ్యం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

జీవితాంతం సమాజ సేవకే అంకితమైన పరిపూర్ణ వ్యక్తి కందుకూరి

AR TELUGU NEWS

అవార్డు అందుకున్న తణుకు ఎస్ఈబీ సీఐ శ్రీనివాస్

AR TELUGU NEWS

రామోజీ రావు గారి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి

AR TELUGU NEWS