కష్టాల్లో స్పందించే లలితా సహృదయ ఫౌండేషన్ సేవలు హర్షణీయం
తణుకు జూన్ 21 :
పశ్చిమగోదావరి జిల్లా గోటేరు గ్రామంలో ఇటీవల యాక్సిడెంట్ ప్రమాదానికి గురైన వెంకటేష్
కాలు విరిగిన కారణంగా
అతనికి కుటుంబ పోషణ కష్టంగా ఉందని తొమ్మిది నెలలు నడవకూడదని చిన్న పిల్లలతో ఇబ్బంది పడుతున్నారని
అతనితో కలిసి పనిచేసే స్నేహితులు తెలియజేయడంతో తణుకు పట్టణానికి చెందిన లలితా సహృదయ ఫౌండేషన్
చైర్మన్ మనుబర్తి లలిత ఆధ్వర్యంలో 25 కేజీల బియ్యం బ్యాగ్,నిత్యవసర సరుకులు మరియు కూరగాయలు పండ్లు అందించినట్లు కార్యవర్గ సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఝాన్సీ లారెన్స్, కృష్ణవేణి, చిన్ని తల్లి పాల్గొని సేవలు అందించారు.