విద్యార్థులకు టెస్ట్, నోట్స్ బుక్స్ కోసం ఆర్థిక సహాయం
నర్సాపురం జూన్ 20 :
నర్సాపురం వలందర రేవు దగ్గర ఉన్న మున్సిపల్ స్కూల్ నందు మదర్ అండ్ చైల్డ్ కేర్ డిసి గంటా ఝాన్సీ లక్ష్మి , ప్రెసిడెంట్ పులపర్తి ప్రతాప్ ఆధ్వర్యములో గురువారం పలు సేవా కార్యక్రమాలు చేశారు. ఈ క్రమంలో కాలేజీలో సెకండ్ ఇంటర్ చదువుతున్న పేద విద్యార్థిని విద్యార్థులకు టెస్ట్ బుక్కులు, నోట్ బుక్కులు నిమిత్తం ఆర్థిక సాయం, చేసినట్లు లయన్స్ సెక్రటరీ బాలా కుమారి తెలిపారు. అనంతరం అంగన్వాడి పిల్లలకు 40 మందికి బిస్కెట్లు పంపిణీ చేశారు. ముగ్గురు క్యాన్సర్ పేషెంట్లకు, ఇద్దరు కదలలేని వికలాంగులకు ఆర్థిక సహాయం చేశారు.సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ సుబ్బలక్ష్మి కి ఘనంగా సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ సెక్రటరీ బాలా కుమారి , డాక్టర్ రాజేంద్రప్రసాద్, గంటా భాస్కర్ రావు చిట్టిబాబు, బాబురావు, సుంకర రమేష్ పాల్గొన్నారు.