*ప్రతిరోజూ సచివాలయానికి చంద్రబాబు*
అమరావతి :
పాలనలో తన మార్క్ అడ్మినిస్ట్రేషన్ చూపించేలా సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.
ప్రతిరోజూ ఉ.10 నుంచి సా.6 గంటల వరకు సచివాలయం లోనే ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు.
మంత్రులు కూడా నిత్యం సెక్రటేరియట్ కు రావాలని ఆయన సూచించారు.
శాఖలపై పట్టు పెంచుకోవాలని, పాలనాపరంగా అవగాహన పెంచుకోవాలని దిశానిర్దేశం చేశారు.
అటు జిల్లాల్లో కొత్త మంత్రుల పర్యటన పూర్తయ్యాకే CM అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగే అవకాశం ఉంది.