సిఎం చంద్రన్న పాలనలో రానున్న ఐదేళ్ళు స్వర్ణయుగమే – తెలుగు దేశం మహిళా నాయకురాలు కొవ్వూరి సీత
పెనుమంట్ర జూన్ 14 :సిఎం చంద్రన్న పాలనలో రానున్న ఐదేళ్ళు స్వర్ణయుగమే, ముఖ్యమంత్రి గా తొలి ఐదు సంతకాలతో రాష్ట్ర వృద్దులకు, ప్రజలకు, యువతకు భద్రత, భరోసా అని తెలుగు దేశం మహిళా నాయకురాలు కొవ్వూరి సీత అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబునాయుడు అమరావతి రాజధానిలో బాధ్యతలు చేపట్టిన వెంటనే తొలి ఐదు సంతకాలతో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు, రైతులకు, వృద్దులకు, వితంతువులకు, వికలాంగులకు, నిరుపేదలకు భద్రత,భరోసా కల్పించారని శ్రీసాయిలక్ష్మీ మహిళా మండలి అధ్యక్షురాలు,టిడిపి నాయకురాలు కొవ్వూరి సీత ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా కొవ్వూరి సీత మెగా డీఎస్సీ,ల్యాండ్ టైటాలింగ్ యాక్ట్, పెన్షన్ పెంపు, అన్నా క్యాంటిన్ల పునరుద్ధరణ,స్కిల్ సెన్సస్ ఫైల్ పై రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టిన వెంటనే ఐదు ముఖ్యమైన ఫైళ్లపై సంతకాలు చేసి రాష్ట్రంలోని అన్ని వర్గాలకు భద్రత, భరోసా కల్పించారన్నారు. ఎన్నికల సందర్బంగా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ మేరకు దాదాపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు (16,347) టీచర్ల పోస్టుల భర్తీకై డిఎస్సీని నిర్వహించే ఫైల్ పై రాష్ట్ర ముఖ్యమంత్రి తొలి సంతకం చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు శ్రీకారం చుట్టారన్నారు. డిఎస్సీ నిర్వహిస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక పోయిందన్నారు. ప్రజల ఆస్తులకు అభద్రతను కల్పించే విధంగా గత ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేస్తూ ముఖ్యమంత్రి రెండో సంతకాన్ని చేశారన్నారు. దీని వల్ల రాష్ట్రంలోని రైతులు, ప్రజలకు వారి ఆస్తులపై పూర్తి భద్రత, భరోసా కల్పించడం జరిగిందన్నారు. సామాజిక భద్రత పథకం క్రింద రాష్ట్ర ప్రభుత్వాన్నికి కష్టమైనప్పటికీ ఎన్టీఆర్ భరోసా పేరుతో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, మత్స్యకారులు, కల్లు గీత కార్మికులు, డప్పు కళాకారులు, హెచ్ఐవి బాధితులు, హిజ్రాలకు నాలుగు వేల రూపాయలు(గతంలో మూడు వేలు),దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు(గతంలో మూడు వేలు),కుష్టుతో వైకల్యం సంభవించినవారికి ఆరు వేల రూపాయలు,కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్నవారికి, డయాలసిస్ స్టేజీకి ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్థులకు పది వేల రూపాయలు(గతంలో ఐదు వేలు)మంచానికి పరిమితమైనవారికి పదిహేను వేల రూపాయలు (గతంలో ఐదువేలు) పెంచే ఫైల్ పై ముఖ్యమంత్రి మూడో సంతకం చేయడం జరిగిందన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ మాసం నుండే ఈ పెంపును వర్తింప చేస్తూ ఏప్రిల్, మే , జూన్ మాసాలకు చెందిన మూడు వేలను కలుపుకుని జూలై మాసంలో మొత్తం ఏడు వేలను వృద్దాప్యపు ఫించనుగా అందజేయనున్నట్లు వారు తెలిపారు. వికలాంగులకు అయితే ప్రస్తుతం ఇచ్చే మూడు వేలను ఆరు వేలకు పెంచడం జరింగిందన్నారు.జూలై ఒకటో తేదీ నుండి ఇళ్ల వద్దే ఫించన్ల పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. నామమాత్రపురేట్లకే నిరుపేదలకు పట్టెడన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను పునరుద్దరిస్తూ సీఎం చంద్రబాబు నాలుగో సంతకం చేయడం జరిగిందన్నారు. తమిళనాడు రాష్ట్రంలో గత ప్రభుత్వం అమలు పర్చిన అమ్మ క్యాంటీన్లను నూతనంగా వచ్చిన ప్రభుత్వం కొనసాగిస్తుంటే మన రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లను గత ప్రభుత్వం మూసివేసిందని విమర్శించారు.అదే విధంగా నిరుద్యోగ యువత అభిరుచికి అనుగుణంగా వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇచ్చి వారి ఉద్యోగ, ఉపాధి అవకాశలను మెరుగుపర్చాలనే లక్ష్యంతో స్కిల్ సెన్సస్ పథకాన్ని అమలు పర్చే ఫైల్ పై ముఖ్యమంత్రి చంద్రన్న ఐదో సంతకం చేసి నిరుద్యోగ యువత భవిష్యత్తుకు భద్రత, భరోసా కల్పించారని ప్రశంసించారు. రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం,జనసేన,బిజెపి కూాటమిపై మంచి భరోసాతో పెద్ద ఎత్తున ఓట్లు వేసి మంచి మెజారిటీతో గెలిపించారన్నారు. ప్రజల తమ ప్రభుత్వంపై ఉంచిన విశ్వాసాన్ని ఏమాత్రము ఒమ్ము చేయకుండా మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చడం జరుగుతుందన్నారు.సీఎం చంద్రబాబు అత్యవసరంగా వివిధ శాఖలతో చర్చించి జగనన్న ఇళ్ల పట్టాల అవినీతిపై, ఇసుక మాఫియా పై విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించి,పేదప్రజల వద్ద ఇళ్ళ పట్టాల నిమిత్తమై ఇరవై, ముప్పై ,యాభై వేల రూపాయలు చొప్పున దౌర్జన్యంగా,బెదిరించి వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇప్పించాలని,(నిరుపేద మహిళలు ఈ డబ్బు చెల్లించడం కొరకు పుస్తెలు సైతం తాకట్టు పెట్టి,అధిక వడ్డీల భారం),ఇంటి నిర్మాణాలు విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని కోరారు.రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయన్నారు.