March 11, 2025
Artelugunews.in | Telugu News App
పశ్చిమగోదావరి జిల్లాభీమవరం

రక్తం. రెండక్షరాల పదమే కాని ఏ జీవైనా బతకాలంటే అత్యవరం

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

రక్తం. రెండక్షరాల పదమే కాని ఏ జీవైనా బతకాలంటే అత్యవరం
 రక్తదానం చేసిన 9 మందికి సత్కారం చేసిన ఎమ్మెల్యే అంజిబాబు

భీమవరం జూన్ 14 :రక్తం’.. రెండక్షరాల పదమే కాని ఏ జీవి అయినా బతకాలంటే ఇది అత్యవసరమని, రక్తం అనేది పరిశ్రమల్లో ఉత్పత్తి అయి అంగట్లో దొరికేది కాదని, కేవలం మనిషిలో మాత్రమే ఉత్పత్తి అవుతుందని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ( అంజిబాబు) అన్నారు. శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అంజిబాబు కార్యాలయంలో ప్రపంచ రక్త దాతల దినోత్సవాన్ని నిర్వహించి అదికసార్లు రక్తదానం చేసిన వారిని సత్కరించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ 18 నుంచి 65 ఏళ్ల వయసున్న ఆరోగ్యవంతులందరూ రక్తదానం చేయవచ్చని, మూడు నెలలకోసారి రక్తం ఇవ్వడం మంచిదని డాక్టర్లు చెబుతున్నారని. ఒక వ్యక్తి జీవిత కాలంలో 168 సార్లు రక్తదానం చేయవచ్చని, రక్తదానం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు. రక్తదానం చేసిన వారిని ఎమ్మెల్యే అభినందించారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానం తో సమానమని, సిఎస్ఎన్ కళాశాల కార్యదర్శి చిడే సత్యనారాయణ ఇప్పటికీ వరకు 80 సార్లు రక్తదానం చేశారని అన్నారు. అనంతరం అధిక సార్లు రక్తదానం చేసిన 9 మందికి ప్రశంసా పత్రాలను అందించి సత్కరించారు. కార్యక్రమంలో చిడే సత్యనారయణ, కోళ్ల నాగేశ్వరరావు, నరహరిశెట్టి కృష్ణ, సకుమల్ల సత్యనారయణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆరమిల్లి  రాధాకృష్ణ మర్యాదపూర్వకంగా కలిసిన బిజెపి రాష్ట్ర కార్యదర్శి శ్రీ పసుపులేటి వెంకట రామారావు మరియు తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బెజవాడ సూర్య కలిశారు

AR TELUGU NEWS

జులై ఏడో తారీఖున ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం

AR TELUGU NEWS

అవార్డు అందుకున్న తణుకు ఎస్ఈబీ సీఐ శ్రీనివాస్

AR TELUGU NEWS