సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థుల ప్రవేశాల పురోగతి పై సదస్సు
నర్సాపురం జూన్ 11 :
స్థానిక శ్రీ వై ఎన్ కళాశాలలో సామాజిక సేవా విభాగ సంయుక్త ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమ సచివాలయ సహాయకులకు సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో సహాయ సాంఘిక సంక్షేమ సాధికారత అధికారి కె. బాలు సాధన మాట్లాడుతూ, సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థినీ, విద్యార్థుల ప్రవేశాలను ఈ సంవత్సరం మరింత ఎక్కువ చేయాలని, దీని కొరకు మీరందరూ ప్రతీ గ్రామానికి, ఏరియాకు వెళ్లి ప్రజలలో, తల్లిదండ్రులలో వసతి గృహాలలో వసతి ఏర్పాట్లపై అవగాహన కల్పించి వంద శాతం అడ్మిషన్లను చేయాలని, వసతి గృహాలలో ఏటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు చర్యలు ఎప్పటి కప్పుడు చేపట్టి విద్యార్థులకు మరిన్ని అవసరాలను తీర్చుతూ, ఇంటి కన్నా హాస్టల్ మెరుగు అనే భావనను వారిలో కల్పించినట్లయితే అది రాబోయే కాలంలో విద్యార్థులే మనకు పబ్లిసిటీ ఇస్తారని, తద్వారా మనం మరిన్ని ప్రభుత్వ పథకాలను, సౌకర్యాలను కల్పించవచ్చని, వారి అభివృద్ధికి మనం బాటలు వేయవచ్చని ‘ అన్నారు. ఈ కార్యక్రమాన్ని కళాశాలలో నిర్వహించినందుకు కళాశాల సెక్రెటరీ అండ్ కరస్పాండెంట్ డా సి సత్యనారాయణ రావు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్య క్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.ఎస్.వి.ఎస్.సాయిబాబా, వైస్ ప్రిన్సిపాల్ బెజవాడ వెంకట రత్నం, కళాశాల డీన్ డా. గంధం శ్రీ రామ కృష్ణ, కళాశాల కార్యాలయ పర్యవేక్షకులు తోట ఏడుకొండలు, అయిదు మండలాల సచివాలయ సహాయకులు సుమారు వందమంది హాజరయ్యారు.