పొన్నమండ నాగేశ్వరరావుకు పూలమాల వేసి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే బండారు
నర్సాపురం జూన్ 10 :
తెలుగుదేశం పార్టీ సీనియర్ మరియు అగ్నికుల క్షత్రియ నాయకుడు పొన్నమండ నాగేశ్వరరావు ఇటీవల అనారోగ్యంతో పరమందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నర్సాపురం మాజీ శాసనసభ్యులు బండారు మాధవ నాయుడు సోమవారం పొన్నమండ నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్సీ బొమ్మిడి నారాయణరావును పరామర్శించారు. ఈ సందర్భంగా బండారు మాధవ నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీ బొమ్మిడి నారాయణరావు స్వయానా బావ అయిన సీనియర్ నాయకుడైన పొన్నమండ నాగేశ్వరరావు అని, ఏ వ్యక్తినైనా ఏ చిన్న తప్పిదమైన ఉంటే నిర్మొహమాటంగా మాట్లాడే వ్యక్తి పార్టీ విజయానికి తన యొక్క సహాయ సహకారాలు ఎంతో ఉండేవని బండారు మాధవ నాయుడు గుర్తు చేశారు. బండారు వెంట మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పొన్నాల నాగబాబు, మాజీ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బండారు రాజా పటేల్ నాయుడు, మాజీ కౌన్సిలర్ శశిదేవి కుమారుడు రాజు, ఎస్సీ సెల్ నాయకులు రేవు ప్రభుదాస్, చింతన్న పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు రెడ్డిమ్ శ్రీనివాస్, వీఆర్వోలు సత్యనారాయణ రాజు గోపాలరావు, రైతు బజార్ జొన్నల సతీష్, పొన్నమండ నాగేశ్వరరావు కుమారుడు యుగంధర్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.