ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రానివ్వద్దు
-మున్సిపల్ అధికారులకు సూచించిన ఎమ్మెల్యే బొలిశెట్టి
తాడేపల్లిగూడెం జూన్ 7:మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది వచ్చినా సహించేది లేదని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ హెచ్చరించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం పరిశీలనకు వెళ్ళిన ఆయనకు శుక్రవారం మున్సిపల్ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలకు తాగునీరు, వీధిలైట్లు, పారిశుద్ధ్యం తదితర అంశాల్లో సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. గతంలో వైసీపీ పాలనలో జరిగిన అవకతవకలన్నీ బయటకు తీస్తానని తమ పరిపాలనలో అవినీతి చేయాలనుకున్న అధికారులు ఎవరైనా బదిలీలు పెట్టుకుని వెళ్ళిపోవచ్చు అని సూచించారు. నిజాయితీగా పనిచేసే అధికారులు ఎవరూ భయపడాల్సిన పనిలేదని ప్రభుత్వం ప్రజలకు సేవ చేసేందుకు ఉద్యోగాలు ఇచ్చిందని దానికి కట్టుబడిచే పని చేసే ప్రతి ఒక్కరికి తన మద్దతు ఉంటుందన్నారు. ఈ సందర్భంగా శాఖల వారీగా అధికారుల పనితీరును సమీక్షించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మురళీకృష్ణ, వివిధ శాఖల అధికారులు నాయకులు పాల్గొన్నారు.

previous post
next post