ఆర్డీవో శ్రీనివాసులు రాజుకు సత్కారం
భీమవరం జూన్ 07 :సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల సహాకారం వల్లే సజావుగా జరిగాయని భీమవరం ఆర్డీవో కే శ్రీనివాసులు రాజు అన్నారు. స్వీప్ యాక్టివిటీస్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీవో శ్రీనివాసులు రాజును సత్కరించారు. ఆర్డీవో మాట్లాడుతూ ఎన్నికల అధికారులకు అభ్యర్థులు ఏజెంట్లు ఓటర్లు అందరూ ఎంతో సహకారం అందించారని, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మమ్మల్ని వెన్నంటి ప్రోత్సహించి నడిపించారని, అందుకే ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం తోపాటు స్వీప్ యాక్టివిటీస్ స్వచ్ఛంద సంస్థల ప్రజా ప్రతినిధులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. స్వీప్ యాక్టివిటీస్ బ్రాండ్ అంబాసిడర్ చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ఎన్నికల అధికారులకు పోలీస్ లకు ప్రజలందరూ అందించిన సహకారం అద్వితీయమని అన్నారు. అనంతరం ఆర్డీవో శ్రీనివాసులు రాజును సత్కరించారు. కార్యక్రమంలో కంతేటీ వెంకటరాజు, లయన్స్ క్లబ్ పట్టణ ఉపాధ్యక్షులు నరహరి శెట్టి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.