టీడీపీ నియోజకవర్గ కో కన్వీనర్ మోకా అనంద సాగర్ కు సత్కారం అంబాజీపేట, మే 31 : రాష్ట్ర అధికార ప్రతినిధి పి గన్నవరం నియోజకవర్గం టీడీపీ కో – కన్వీనర్ మోకా అనంద్ సాగర్ ను నియోజకవర్గ టీడీపీ ఎస్సీ నాయకులు శుక్రవారం ఘనంగా సత్కరించారు. తెలుగుదేశం పార్టీ కో కన్వీనర్ గా నియమితులయిన సందర్బంగా నేతలు అభిమానులు హాజరై మోకా కు అభినందనలు తెలిపారు. దళిత సామాజిక వర్గానికి చెందిన మోకా ఆనంద సాగర్ ను నియోజకవర్గ కో కన్వీనర్ గా నియమించడం పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు యువనాయకుడు నారా లోకేష్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు అచ్చెన్న నాయుడు కు కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమం లో టీడీపీ ఎస్సీ నాయకులు నక్కా సత్యనారాయణ గెళ్లా అశోక్ పల్లి రామూర్తి మొతా వెంకటేశ్వరరావు పెట్టా కృష్ణ కిషోర్ యాళ్ల సత్యనారాయణ పులపర్తి రవి కుమార్ నేలపూడి దామోదర్ మోకా శ్రీను నాగావరపు అన్నవరం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మహిళలకు చీరలు పంపిణి చేశారు.
