- ఉద్యోగ నిర్వహణలో ఉన్నత అధికారుల గుర్తింపు, సామాజిక సేవలో ఆణి ముత్యం
నంది అవార్డు గ్రహీత కె జయమణి
తణుకు మే 31 :వృత్తి లో ఆంకింత భావంతో ఉండాలి, చేసే పనిని భగవంతుని సేవగా భావిస్తూ మంచి మనసుతో సమాజంలో సేవాభావం కలిగి అందరి మన్ననలు పొందుకొని ఫలితం కోసం పనిచేయకుండా ఇతరుల యొక్క అవసరాలు బాధ్యత అను గుర్తించి జీతం కోసమే కాదు గాని జీవితాన్నే పారదర్శకత చూపించే గొప్ప ఉన్నత ఉద్యోగిని సి హెచ్ ఓ కే జయమణి. ఈమె ప్రభుత్వ ఆసుపత్రి యందు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ తన ఉద్యోగాన్ని కేవలం వృత్తి అనే కాదు గాని సమాజంలో ఎందరో అభాగ్యులైన వారికి తాను సేవలందిస్తూ, నేనున్నాను అనే ఒక్క మాటతో అవసరమైన వారికి భరోసా కల్పించే దిశగా అడుగులు వేసే గొప్ప ధర్మకర్తని అంధ్రప్రదేశ్ అంబేద్కర్ ఆలోచన విధానం కమిటీ సభ్యులు చవ్వాకుల భరత్ కుమార్ స్పష్టం చేశారు. జయమణి సేవలను గుర్తించి హైదరాబాద్ రవీంద్ర భారతీ మెయిన్ హాల్ నందు జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో బంగారు నంది అవార్డు బహుకరించారు.
ఇందిరా ఆర్ట్ ఫౌండేషన్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా సినీ గానలహరి,కవి సమ్మేళనం,సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ఇందిరా ఎక్స్ లెన్స్ అవార్డులు కార్యక్రమం ను హైదరాబాద్ రవీంద్ర భారతి మెయిన్ హాల్ లో నిర్వహించారని ప్రధాన కార్యదర్శి ఆలూరి విల్సన్ తెలిపారు.ఈ క్రమంలో ఇందిరా ఆర్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ ఎన్ ఇందిరా మాట్లాడుతూ సమాజం లో అన్ని రంగాలలో విశిష్ట సేవలందించిన విభిన్న ప్రతిభావంతులను ఎంపిక చేసి ఇందిరా ఎక్స్ లెన్స్ మరియు నంది అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించడం శుభపరిణామం అని స్పష్టం చేశారు. ఈ కార్యమానికి తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం పూర్వ ఉపాధ్యక్షులు పద్మ శ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సినీ నటుడు, దర్శకుడు,& సంగీత దర్శకులు ఎం వి కృష్ణారెడ్డి, కె అచ్చిరెడ్డి, పంజలా జైహింద్ గౌడ్, మా కార్యవర్గ సభ్యులు చింతకుంటా రామ్ మాణిక్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నారాయణ స్వామి, సినీ నిర్మాత, విజయ చిత్ర పత్రిక ఎడిటర్ గుర్రపు విజయకుమార్ మరియు చిక్కడ పల్లి పి ఎస్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏ సీతయ్య మరియు విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్, కవియత్రి,సంఘ సేవకురాలు పాలడుగు సరోజిని దేవి పాల్గొని ప్రసంగించారు. అనంతరం సిహెచ్ ఓ కె జయమణి నిర్వహించిన వివిధ సేవా కార్యక్రమాలు దృష్ట్యా, మరియు గత కోవిడ్ సమయంలో ఆమె ఎనలేని సేవ చేసిన సందర్భంగా ఆమెకు నంది అవార్డు దక్కింది. ఈ కార్యక్రమంలో ఇందిరా ఆర్ట్స్ ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ యస్ ఇందిరా, డాక్టర్ పి వి పి అంజనీ కుమారి.డాక్టర్ ఆలూరి విల్సన్, చవ్వాకుల భరత్ కుమార్ మరియు తదితరులు పాల్గోన్నారు.