సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన
ధవళేశ్వరం ఆనకట్టవల్ల గోదావరి డెల్టా సస్యశ్యామలం
నర్సాపుర31:నరసాపురం ప్రధమ శ్రేణి శాఖా గ్రంధాలయం నందు జరుగుచున్న వేసవి జ్ఞాన శిబిరంలో వివిధ స్కూల్స్ నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొంటున్నారు. గ్రేడ్ వన్ లైబ్రేరియన్ కేజే ఎస్ ఎల్ కుమారి ఆధ్వర్యంలో ప్రతిరోజు విద్యార్థులు నేర్చుకుంటున్న అంశాలపై శుక్రవారం పరీక్ష ను నిర్వహించారు. సుధీర్ మోహన్, జీవన్ కుమార్ పర్యవేక్షించారు. అనంతరం శాస్త్రవేత్త సుబ్బారావు సర్ ఆర్థర్ కాటన్ యొక్క జీవిత చరిత్ర ను వివరిస్తూ ఆయన నిర్మించిన ధవలేశ్వరం ఆనకట్టవల్ల గోదావరి డెల్టా ఎంత సస్యశ్యామల మైందో, నీటి వనరులను కాపాడుట గురించి వివరాలు తెలియజేశారు. డొక్కా సీతమ్మ యొక్క సమాజ సేవ లను కూడా పిల్లలకు వివరించారు. ఆర్టిస్ట్ శ్రీనివాస్ డ్రాయింగ్ క్లాస్ లో వృత్తం ,స్తూపం ,ఘనము, పిరమిడ్ కొన్ని ఆకారాల ద్వారా బొమ్మల రూపంలోకి ఎలా మార్చుకోవాలో మరియు కలర్స్ గురించి వాటి ద్వారా స్కిన్ టోన్ ఎలా కలపాలో పిల్లలకు శిక్షణ ఇచ్చినారు తమరుపు కృష్ణ పిల్లలకు బోయగాడు – పక్షులు కథను వినిపించారు. పుస్తక పఠనం, పత్రిక పఠనం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ మాస్టారు, సూర్యంబాబు, ప్రవీణ్, మనోజ్ పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.