30 మంది మహిళలకు కోలాటంలో శిక్షణ ఇచ్చిన బోల్లా దుర్గారావు
తణుకు మే 31 :స్థానిక తణుకు టిటిడి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ వారి ఆధ్వర్యంలో చాగల్లు మండలం ఊనగట్ల గ్రామానికి చెందిన గురువులు బోల్లా దుర్గారావు ఆధ్వర్యంలో శ్రీ కేశవా కోలాట భజన మండలి ఆధ్వర్యంలో వివిధ ఆలయాలలో గజ్జల పూజ మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. సుమారు 30 మంది మహిళలకు కోలాటం భజనను బోల్లా దుర్గారావు శిక్షణ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.పూజలు అనతరం కోలాట భజన మండలి మహిళ బృందం చే కోలాట ప్రదర్శన తో వివిధ కార్యక్రమాలలో భక్తులను అలరించారు.