ఘనంగా గజ్జల పూజ మహోత్సవంలో కోలాట భజన
తణుకు మే 30 : తణుకు పట్టణంలో టిటిడి దేవస్థానం దాన సాహిత్య ప్రాజెక్ట్ శ్రీ కేశవా కోలాట భజన మండలి ఆధ్వర్యంలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం ఉదయం గజ్జల పూజ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. సుమారు మహిళలు 30 మంది పాల్గొని పూజలు నిర్వహించారు. అనతరం కోలాట భజన మండలి మహిళ బృందం చే కోలాట ప్రదర్శన తో పాల్గొన్న భక్తులను అలరించారు. ఈ కార్యక్రమంలో బొల్లా దుర్గారావు, అరేపల్లి దుర్గా, తణుకు టౌన్ దిశా ప్రెసిడెంట్ కొలగాని కృష్ణ వేణి మరియు తదితర భక్తులు పాల్గొన్నారు.