కథలు చదవడంతో విద్యార్థులకు ఊహ శక్తి పెరుగుతుంది – సీనియర్ శాస్త్రవేత్త రంగినీడి సుబ్బారావు
నర్సాపురం మే 28 :నరసాపురం ప్రథమ శ్రేణి శాఖ గ్రంధాలయం నందు వేసవి విజ్ఞాన శిక్షణా తరగతులు సందర్భంగా పిల్లలు చాలా ఉత్సాహం గా పాల్గొని పోటా పోటీ గా పుస్తకాలు చదివినారు. రిసోర్స్ పర్సన్ బార్క్ సీనియర్ శాస్త్రవేత్త రంగినీడి సుబ్బారావు పిల్లలుకు ఇష్టమైన కథలు పాము – ముంగిస కథ జింక – తోడేలు కథలను వివరించి వాటిలో ఉన్న నీతిని విద్యార్థులకు తెలియజేసారు. కథలు చదవడంతో ఊహ శక్తి పెరుగుతుంది భాష భావవ్యక్తీకరణ స్పష్టంగా ఉంటాయి అని స్పష్టం చేశారు. స్ఫూర్తినిచ్చే కథలు దేశ నాయకులు, దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వారి కథలు వారి చరిత్రలు లైబ్రరీలో అందరికీ అందుబాటులో ఉన్నాయి అని తెలిపారు. ప్రతి విద్యార్ధి చదివి తెలుసుకోవాలి అని సూచించారు. మన భూమి ప్రత్యేకతను గురించి పర్యావరణం గురించి పర్యావరణాన్ని పరిరక్షించవలసిన బాధ్యతను వివరించారు. సమాజంలో మానవ జీవనానికి అవసరమైన అంశాలను పిల్లలచే చెప్పించి ఐడియల్ కంట్రీని నిర్మించే ఎక్సర్సైజ్ చేయించారు. ఆర్టిస్ట్ తోట శ్రీనివాస్ చిత్రలేఖనంలో బొమ్మలను ఏ విధంగా గీయాలో పిల్లలకు తర్ఫీదు ఇచ్చారు. పిల్లలు చాలా సంతోషంగా శ్రద్ధగా బొమ్మలను వేయడం నేర్చుకున్నారు. రిసోర్స్ పర్సన్ తమరపు కృష్ణ పిల్లలకు యోగ మెడిటేషన్ మరియు కరాటే ప్రాక్టీస్ చేయించారు. క్రమశిక్షణ, మంచి అలవాట్లు గురించి పిల్లలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో
రిటైర్డ్ ఇన్సూరెన్స్ ఆఫీసర్
ఈద ప్రకాశం, సాఫ్ట్ లైన్ సుధీర్ మోహన్ ,సూర్యం బాబు, శ్రీనివాస్, ప్రవీణ్, జీవన్ కుమార్ మరియు పిల్లల తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సమ్మర్ క్యాంపు జూన్ 7వ తేదీ వరకు జరుగుతుందని పిల్లలు పాల్గొనవలసిందిగా గ్రేడ్ వన్ లైబ్రేరియన్ కే జే ఎస్ ఎల్ కుమారి తెలిపారు.