March 9, 2025
Artelugunews.in | Telugu News App
తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

రంగస్థలం కళాకారుల సంఘం సేవలు ఆదర్శప్రాయం

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

రంగస్థలం కళాకారుల సంఘం సేవలు ఆదర్శప్రాయం

– సత్య ఆఫ్సెట్ అధినేత సత్తి జగదీష్ రెడ్డి

తాడేపల్లిగూడెం, మేజర్ న్యూస్: స్థానిక గీతా మందిరంలో నిర్వహించిన సంఘం 144వ నెల వారి సభా కార్యక్రమానికి సత్య అప్పసెట్అధినేత సత్తి జగదీష్ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. అధ్యక్షుడు సూరంపూడి వెంకటరమణ అధ్యక్షుడు వహించారు. నవాబుపాలెం సొసైటీ మాజీ అధ్యక్షుడు పరిమి వీరభద్రరావు జ్యోతి ప్రజ్వలన చేశారు. తెలుగు సాహితీ సమాఖ్య ఉపాధ్యక్షులు గోదావరి ప్రభాకర్ శాస్త్రి, సిఐటియు నాయకులు నాగేశ్వరరావు, విద్యార్థి నాయకుడు గోపి, సంఘ ఉపాధ్యక్షులు మాస బాబురావు, కార్యదర్శి జెకె కృష్ణ, కోశాధికారి టి మురళీకృష్ణ, సాంస్కృతిక సమన్వయకర్తలు సాయిచరణ్ నాగేశ్వరరావు పొన్నాడ ప్రకాష్, గౌరవాధ్యక్షురాలు కే శారద మాట్లాడారు. ఈ సందర్భంగా నటుడు దర్శకుడు ఇటీవల డాక్టరేట్ పొందిన కోపల్లె  శ్రీనివాస్ కి సత్కారం రంగస్థలం కళాకారుడు పిప్పిరి శెట్టి వెంకటేశ్వరరావు నిడదవోలుకు కళా సత్కారం, పెంటపాడు డిఆర్ గోయింకా డిగ్రీ కళాశాల తెలుగు శాఖ అధిపతి డాక్టర్ సుంకర గోపాల్ కు ఉద్యోగ సేవ పురస్కారం అందజేశారు. సీనియర్ హార్మోనియం

కళాకారుడు పిల్యానం గంగాధరకు ఆర్థిక సత్కారం చేశారు. సభకు ముందు వెంకటేశ్వరరావు, జి నాగమణి తదితరులు హరిచంద్ర నాటక దృశ్యాలు ప్రదర్శించారు. స్థానిక కళాకారులు సంగీత విభావరి నిర్వహించారు. బి.వి.ఆర్ కళా కేంద్రం వ్యవస్థాపకుడు బుద్దాల వెంకట రామారావు, ప్రముఖ కళాకారులు సరస్వతుల హనుమంతరావు, దాసరి కాశీ విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎంటీఎస్ ఉపాధ్యాయుల వయోపరిమితి పెంచాలి: బెనర్జీ

AR TELUGU NEWS

రామోజీ రావు గారి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి

AR TELUGU NEWS

విద్యార్థులకు మెడిటేషన్ ద్వారా మనోవికాసానికి దోహదపడుతుంది – గ్రేడ్ వన్ లైబ్రరీ యన్ కే జే ఎస్ ఎల్ కుమారి

AR TELUGU NEWS