కుటుంబ సమస్యల పరిష్కారంలో తాడేపల్లిగూడెం దిశా టీమ్ భేష్
తాడేపల్లిగూడెం 27: దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ నేషనల్ చైర్మన్ బీవీ రాజు మరియు కళ్యాణ్ ఆశీస్సులు మేరకు పశ్చిమ గోదావరి జిల్లా లింగారెడ్డి గూడెం,మైనం వెంకటేష్, నీలాద్రిపురం మైనం దుర్గా లకు వివాహమయ్యి 11 సంవత్సరాలు అయ్యింది. అమ్మాయి దుర్గా వివాహ సమయంలో 40 సెంట్లు పొలం ఇస్తాం అని ఆమె తల్లి తండ్రులు అన్నారు. కానీ ఇప్పటివరకు ఇవ్వలేదు అని అబ్బాయి తరపువారు తాడేపల్లిగూడెం దిశాటీం ని ఆశ్రయించారు. దిశా టీమ్ స్టేట్ ఉపాధ్యక్షురాలు కొల్లా విజయలక్ష్మి ఇంటి వద్ద ఆదివారం అబ్బాయి తరపున తల్లిదండ్రులు, అమ్మాయి తరఫున తల్లి తండ్రులు ఇరువైపున పెద్దలు కలిసి సమీక్షంచిగా వ్రాస్తానన్నా 40 సెంట్లు పొలం రాయమని కోరడం జరిగింది. అమ్మాయి తండ్రి, అన్న మంచి రోజు చూసి పొలం వ్రాసి ఇస్తాం అని పెద్దల సమక్షంలో ఒప్పందం కుదిరింది ఈ సమస్య ను దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దిశా స్టేట్ ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి బాధ్యత తీసుకోవడం పై ఆమెను పలువురు ప్రశంసించారు.