మొక్కలు పెంపకం ద్వారా సమాజానికి శ్రేయస్సు – లైన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ ఏ నళిని దేవి
నర్సాపురం మే 23 : నర్సాపురం ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయం నందు వేసవిశిక్షణ తరగతుల్లో భాగంగా గురువారం పిల్లలకు కథలు చెప్పడం, కథలు చెప్పించడం, నాయకుల జీవిత చరిత్రలు విజ్ఞాన సర్వస్వాలు చదివించడం జరిగింది. అనంతరం లైన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ ఏ నళిని
దేవి పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ గురించి మొక్కల పెంపకం వాటి ఉపయోగాలు గురించి చెప్పారు. మొక్కలు పెంపచడం ద్వారా సమాజానికి ఎంతో శ్రేయస్సు అని వివరించారు. మరియు లయన్స్ ఇంటర్నేషనల్ సేవా సంస్థల గురించి తెలియజేయడం జరిగింది. పిల్లలకు మొక్కలు మరియు స్నాక్స్ కూడా పంపిణీ చేసినారు స్పోకెన్ ఇంగ్లీష్ , యోగ మెడిటేషన్, గణితంలో మెలకువలు , క్రాఫ్ట్ లో శిక్షణ ఇవ్వడం జరిగింది స్కూల్ అసిస్టెంట్ జి శ్రీనివాస్ ,స్కూల్ హెచ్ఎం నాగలక్ష్మి, సుధీర్ మోహన్ ,సూర్యం బాబు, ప్రవీణ్ ,జీవన్ రిసోర్స్ పర్సన్స్ గా వ్యవహరించారు.కుమారి, శ్రీనివాస్ ,సూర్యనారాయణ పిల్లలు తల్లిదండ్రులు గ్రంథాలయ పాఠకులు తదితరులు పాల్గొన్నారు జూన్ నెల 7వ తేదీవరకు జరిగే ఈ యొక్క సమ్మర్ క్యాంపులో పిల్లలందరూ పాల్గొనవలసిందిగా గ్రేడ్ వన్ లైబ్రేరియన్ కేజే ఎస్ ఎల్ కుమారి తెలిపారు.