వేదల్లోంచే అన్ని ఉద్భవిస్తాయి .. శ్రీనివాస్ వర్మ
* వేదోక్తంగా భైరవ హోమం, మన్యశుక్తా హోమాలు, వేధ ఘోష
భీమవరం మే 23 : వేదల్లోంచే అన్ని ఉద్భవిస్తాయని, 11 రోజులపాటు మహా యాగాలను మన ప్రాంతంలో నిర్వహించడం గొప్ప విశేషమని నరసాపురం ఎంపీ అభ్యర్ధి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. భీమవరం డిఎన్నార్ కళాశాలలో జరుగుతున్న అతిరాత్ర మహాయాగంలో భాగంగా గురువారం సోమయగంలో దేవతలకు సోమలతను మధించి సోమరసాన్ని తీసి ఆ రసాన్ని దేవతలకు యజ్ఞ ముఖంగా అందించారు. అనంతరం భక్తులకు సోమ రసాన్ని అందించారు. యజ్ఞ కర్త జంధ్యాల శ్రీనివాస సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ దైవారాధన మించిన భక్తి మరొకటి లేదని, ఇటువంటి మహా యజ్ఞ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని అన్నారు. యజ్ఞ పర్యవేక్షకులు చెరుకువాడ రంగసాయి, కంతేటీ వెంకటరాజు, నడింపల్లి బంగార్రాజు, నరహరిశెట్టి కృష్ణ మాట్లాడుతూ 76వ అతిరాత్ర మహయగం ఎంతో దిగ్విజయంగా జరుగుతున్నాయని, 108 మంది రుత్వికులచే నాలుగు విభాగాల్లో భైరవ హోమం, మన్యశుక్తా హోమం, స్వయంవర కళ హోమం, మహాలక్ష్మి హోమం, దేవతార్చన, ములమంత్ర జపములు, ఈశ్వరునికి అభిషేకాలు నిర్వహించామని అన్నారు. కార్యక్రమంలో డిఈవో ఆర్వీ రమణ, జిల్లా వైద్య శాఖాధికారి కే ఉమా మహేశ్వరరావు, జిల్లా రవాణా శాఖ అధికారి టీ ఉమా మహేశ్వరరావు, ఖజానా అధికారి అల్లూరి రవివర్మ తదితరులు పాల్గొన్నారు.