March 8, 2025
Artelugunews.in | Telugu News App
పశ్చిమగోదావరి జిల్లా

పోస్టల్ బ్యాలెట్, ఈ,టి,పి,బి ఎస్ పొరపాట్లకు తావులేని విధంగాఓట్ల లెక్కింపును పూర్తి చేయాలి.. జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

పోస్టల్ బ్యాలెట్, ఈ,టి,పి,బి ఎస్ పొరపాట్లకు తావులేని విధంగాఓట్ల లెక్కింపును పూర్తి చేయాలి..

జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్

భీమవరం మే 22 : బుధవారం స్థానిక కలెక్టరేట్ వశిష్ట కాన్ఫరెన్స్ హాల్ నందు పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓటర్ల ఈటిపిబిఎస్ (ఎలక్ట్రానికల్లి ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్) ఓట్ల లెక్కింపు పై జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత నియోజకవర్గాల ఆర్వోలకు, ఏఆర్వోలకు శిక్షణా తరగతులను నిర్వహించారు. తొలుత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా లెక్కింపు ప్రక్రియను క్షుణ్ణంగా వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఎంతో ముఖ్యమైనదని, పొరపాట్లకు తావులేని విధంగా ఓట్ల లెక్కింపు పూర్తి చేయాలన్నారు. ఏడు నియోజకవర్గాలకు సంబంధించి 51 మంది ఏఆర్వోలను ఓట్ల లెక్కింపు విధులకు కేటాయించడం జరిగిందని, 9 మంది ఏఆర్వోలు పార్లమెంట్ నియోజకవర్గానికి, 42 మంది ఏఆర్వోలు ఏడు అసెంబ్లీ నియోజవర్గాల విధుల్లో పాల్గొంటారన్నారు. జూన్ 4వ తేదీ ఉదయం 8 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు కంటే ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి టేబుల్ కు నలుగురు సిబ్బందిని నియమించడం జరుగుతుందని, వారిలో ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్స్, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారని తెలిపారు. మూడు దఫాలుగా రాండమైజేషన్ పక్రియ చేసిన అనంతరం కేబుల్ వారీగా సిబ్బంది కేటాయింపు ఉంటుందన్నారు. డిక్లరేషన్ వ్యాలీడ్ కాకపోతే పోస్టల్ బ్యాలెట్ ఇన్ వ్యాలీడ్ అవుతుందన్నారు. అలాగే ఓటర్ సిగ్నేచర్, గెజిటెడ్ అధికారి సంతకం, లేకపోవడం, తదితర నిబంధనలను పాటించని సందర్భంలో కూడా ఓటు చెల్లనిదిగా పరిగణించబడుతుందన్నారు. ఓటు వ్యాలీడ్, ఇన్ వ్యాలీడ్ పై తుది నిర్ణయం రిటర్నింగ్ అధికారిదేమని స్పష్టం చేశారు. సర్వీస్ ఓటర్ల ఈటీపీబిఎస్ ను స్కానింగ్ ను పక్కాగా నిర్వహించి లెక్కింపును పూర్తి చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి జె.ఉదయ భాస్కర రావు, జిల్లా, గ్రామ సచివాలయాల అధికారి మరియు జిల్లా ఎన్నికల శిక్షణ అధికారి కె.సి.హెచ్. అప్పారావు, ఏపి టూరిజం జె.డి మరియు ఆచంట నియోజకవర్గం రిటర్నింగు అధికారి వి.స్వామి నాయుడు, నరసాపురం ఆర్డీవో మరియు రిటర్నింగ్ అధికారి యం.అచ్యుత అంబరీష్, భీమవరం ఆర్డీవో మరియు రిటర్నింగ్ అధికారి కె.శ్రీనివాసులు రాజు, తణుకు మున్సిపల్ కమీషనరు మరియు రిటర్నింగ్ అధికారి బి.వెంకట రమణ, తాడేపల్లిగూడెం ఆర్డీవో మరియు రిటర్నింగ్ అధికారి కె.చెన్నయ్య, కెఆర్ సి డిప్యూటీ కలెక్టరు మరియు పాలకొల్లు నియోజక వర్గ రిటర్నింగు అధికారి బి.శివనారాయణ రెడ్డి, ట్రైనీ డిప్యూటీ కలెక్టరు కానాల సంగీత్ మాధుర్, జిల్లా కలెక్టరేటు పరిపాలనా అధికారి పి పాపారావు, ఎలక్టన్స్ సూపరింటెండెంట్ సి.హెచ్.దుర్గా ప్రసాదు, డిప్యూటీ తహాశీల్దారు యం.సన్యాసి రావు, ఏఆర్వోలుగా నియమితులైన తహాశీల్దార్లు, యంపిడివోలు, డిప్యూటీ తహాశీల్దార్లు, టెక్నికల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు

Related posts

వివేకానంద స్కూల్లో దసరా వేడుకలు

AR TELUGU NEWS

అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో  క్యాంప్

AR TELUGU NEWS

రజక ఫెడరేషన్ చైర్మన్ పదవి కాకినాడ రామారావుకు ఇవ్వాలి

AR TELUGU NEWS