భారతరత్న రాజీవ్ గాంధీ 33వ వర్ధంతిలో ఘన నివాళి
కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంకెం సీతారామ్
భీమవరం మే 21 :
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వన్ టౌన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ భారతరత్న రాజీవ్ గాంధీ వర్ధంతి పురస్కరించుకుని భీమవరం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంకెం సీతారామ్ ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తరఫున భారత ప్రధానిగా సుమారు 15 సంవత్సరాలు విశేష సేవలు అందించిన ఘనత మన రాజీవ్ గాంధీకే దక్కుతుంది అటువంటి మహోన్నత వ్యక్తికి ఈరోజు నివాళులర్పించడం జరిగింది మరియు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిం చింది రాజీవ్ గాంధీ కావడం అందరూ గర్వపడాల్సిన విషయం ఈరోజు మన భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందంటే దీనికి ప్రధాన కారణం రాజీవ్ గాంధీ అందించిన విశేష సేవలే కానీ ఇదే రోజు తమిళనాడు లోని శ్రీ పెరంబదూర్ ప్రాంతంలో ఆత్మహుతి దాడికి గురై వీర మరణం పొందారు మన భారతదేశం కోసం తన ప్రాణాలు సైతం లెక్కచేయ కుండా ప్రజలకు సేవ చేయడమే ధ్యేయంగా పెట్టుకున్న త్యాగ మూర్తి మన రాజీవ్ గాంధీ కావడం గమనార్హం అటువంటి మహోన్నత వ్యక్తికి నివాళులర్పించడం చాలా ఆనందాయకమైన విషయం ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు అనంతరం రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సోము నాగ కేశవ బాబు యూత్ టౌన్ ప్రెసిడెంట్ బోనం రవికుమార్ మద్దాల సాయికుమార్ రామరాజు ఉండి యూత్ వైస్ ప్రెసిడెంట్ బూరాడ గౌరీ నాయుడు కాళ్ల మండలం యూత్ ప్రెసిడెంట్ పాండ్రంకి దుర్గారావు సోము దేవకుమార్ కూరెళ్ళ సాయి రమేష్ యూత్ నాయకులు గుండె సురేష్ ,నల్లి రాజేష్ సెల్వియా, రత్నమణి తదితరులు పాల్గొన్నారు.