పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం స్థానిక శేషు మహల్ థియేటర్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్టేట్ కన్వీనర్ చావాకుల సురేష్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీడీపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్,యెగ్గిన నాగబాబు పాల్గొన్నారు, అభిమానుల మధ్య ఏర్పాటుచేసిన కేక్ ని కట్ చేసి వేడుకలను ప్రారంభించిన గొర్రెల శ్రీధర్ మరియు యేగ్గిన నాగబాబు, అనంతరం గతంలో ఎన్టీఆర్ సినిమాకు బ్యానర్ కడుతూ ప్రమాదశాతవస్తు చనిపోయిన ఎన్టీఆర్ అభిమాని పండు కుటుంబ సభ్యులకు ఎన్టీఆర్ పంపించిన 2 లక్షల రూపాయలు అందించారు, ముగ్గురు పేద విద్యార్థులకు 25 వేల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందించారు, పలువురు వ్యక్తులు మాట్లాడుతూ సినిమా ప్రపంచంలో తనకంటూ ఒక పేరును సంపాదించుకోవడం, ఏ పాత్రలైనా అవలీలగా చేయడం ఆయనకే చెల్లిందని తెలిపారు, పేదలకు సహాయం చేయడంలో కూడా ఎన్టీఆర్ ముందుంటారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
