తాడేపల్లిగూడెం మే18: బదిలీపై వెళ్లిన మున్సిపల్ కమిషనర్ డాక్టర్ అనపర్తి శామ్యూల్ మున్సిపల్ సిబ్బందిని వినియోగించుకుంటూ అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ టీడీపీ పట్టణాధ్యక్షుడు పట్నాల రాంపండు శనివారం ఆర్డీవో చెన్నయ్యకు వినతిపత్రం అందించారు. ఇన్ఛార్జి కమిషనర్ గా మురళీకృష్ణకు బాధ్యతలు అప్పగించకుండా, సిబ్బందికి జీతాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. వారికి న్యాయం చేయాలని కోరారు.