ఈవియంల స్ట్రాంగ్ రూములను తనిఖీలు చేసిన
జిల్లా ఎన్నికల అధికారి..
సుమిత్ కుమార్ గాంధీ..
భీమవరం మే 17 :శుక్రవారం భీమవరం విష్ణు కాలేజీలో భద్రపరిచిన ఈవీఎంల స్ట్రాంగ్ రూములను జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేసి, భద్రతా అధికారులతో సమీక్షించి తగు సూచనలు జారీ చేశారు. పరిశీలన అనంతరం స్ట్రాంగ్ రూంల వద్ద ఏర్పాటు చేసిన సందర్శికుల పుస్తకం నందు జిల్లా ఎన్నికల అధికారి సంతకం చేశారు. భద్రతా అధికారులతో మాట్లాడుతూ స్ట్రాంగ్ రూమ్ లు భద్రత దృష్ట్యా అనుముతులేని ఏ ఒక్కరిని స్ట్రాంగ్ రూమ్ ల ప్రదేశానికి అనుమతించవద్దని, ఐడి కార్డులు కలిగిన వ్యక్తులకు సంబంధించి ఐడి కార్డును, వ్యక్తులను పూర్తిగా తనిఖీ చేసిన మీదటే నిర్దేశించిన ప్రాంతం వరకు మాత్రమే ఆ అనుమతించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఏ ఒక్కరికి సెల్ ఫోన్ తీసుకువెళ్లడానికి అనుమతి లేదని, అనుమతి ఉన్న వ్యక్తుల వద్ద నుండి కూడా సెల్ ఫోన్ డిపాజిట్ చేసుకుని మాత్రమే అనుమతించాలన్నారు.
ఆచంట, పాలకొల్లు, నరసాపురం, తణుకు సెగ్మెంట్లకు సంబంధించిన బ్యాలెట్ బాక్స్ లను విష్ణు కాలేజీ నందు, భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం సెగ్మెంట్లకు సంబంధించిన బ్యాలెట్ బాక్స్ లను ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కళాశాల స్ట్రాంగ్ రూమ్ ల నందు భద్రపరచడం జరిగింది.
స్ట్రాంగ్ రూములు తనిఖీలు సందర్భంలో జిల్లా రెవెన్యూ అధికారి జె.ఉదయ భాస్కరరావు, పోలీస్ అధికారులు, తదితరులు ఉన్నారు.