March 14, 2025
Artelugunews.in | Telugu News App
ఆంధ్రప్రదేశ్పశ్చిమగోదావరి జిల్లా

రిజిస్ట్రేషన్ అయిన వాహనాల్లోనే ధాన్యం తక్షణం తరలించాలి – మామిడిశెట్టి రామాంజనేయులు

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

రిజిస్ట్రేషన్ అయిన వాహనాల్లోనే ధాన్యం తక్షణం తరలించాలి – మామిడిశెట్టి రామాంజనేయులు

యలమంచిలి మే 17 : వాహనాలు ఏర్పాటు చేసి వెంటనే ధాన్యం కొనుగోలుచేయాలని కౌలురైతుల సంఘం డిమాండ్ చేశారు. జిల్లాలో గతకొద్ది రోజులుగా అకాల వర్షాలు కురుస్తూ రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వ అధికారులు ధాన్యం కొనుగోలు మరింత ముమ్మరం చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలుపై యలమంచిలి మండలంలో పర్యటించి రైతులతో మాట్లాడమన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం మిల్లులకు తరలించాక రోజులు తరబడి వాహనాలు రావడంలేదని దన్నారు. దీనికితోడు జీపిఎస్ రిజిస్ట్రేషన్ అయ్యిన వాహనాలే ధాన్యం తరలించాలని నిబంధనలు ఉండటంతో రైతులు అత్యవసరంగా వేరే వాహనాల్లో ధాన్యం తరలించే పరిస్థితి లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈసందర్భంగా కాంబోట్లపాలెం, గుంపర్రు, చిరగాలపల్లి గ్రామాలకు చెందిన పలువురు రైతులు మాట్లాడుతూ కాజ గ్రామంలోని జెబిఆర్, అశ్వతా రైస్ మిల్లులు, యలమంచిలి లోని మారుతి సోమేశ్వర,మరికొన్ని రైస్ మిల్లులోను ధాన్యం దిగుమతి తరువాత ఏమెంట్ బిల్లులు ఇవ్వడం లేదని దీంతోపాటు ధాన్యం తరుగు చూపించి డబ్బలు కట్టించుకుంటున్నారని ఆ వివరాలు కూడా ఇవ్వడం లేదని ఆరోపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారన్నారు. మిల్లుల వద్ద ఉన్న కస్టొడియన్ అధికారులు రైతులను పట్టించుకోవడం లేదన్నారు. తక్షణం వాహనాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు ముమ్మరం చేయాలని, రైస్ మిల్లర్ల మోసాలు అరికట్టాలని సమస్యను యలమంచిలి తహశీల్దార్ దృష్టికి తీసుకెళ్లామని రామాంజనేయులు తెలిపారు. ఈసందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ సమస్యను వీఆర్వో ల దృష్టికి తీసుకెళి వెంటనే తగు చర్యలు తీసుకుంటామని తెలిపారన్నారు. ఈకార్యక్రమంలో కౌలురైతులు, రైతులు పి.జార్జిబాబు, యు.సత్తిబాబు,జె.త్రిమూర్తులు, జె.శ్రీను, బి.చంటి,సిహెచ్ సత్యనారాయణ, ఎ.వీరాంజనేయులు,పి.వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

[5/17, 5:33 PM] P Prasad: పుట్టినరోజు నాడు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయం….

రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

భీమవరం, మే 17(ఆంధ్రరేఖ ప్రతినిధి)

పుట్టినరోజు నాడు ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలు చేసి తమ దాతృత్వాన్ని చాటుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. పార్టీకి చెందిన వెదురుపర్తి అరుణ్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం తాడేరు వద్ద ఉన్న వృద్ధుల ఆశ్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ చేతుల మీదుగా వృద్ధులకు అన్నదానం, వృద్ధాశ్రమానికి బియ్యం ను, నిత్యవసర సరుకులను జివిఆర్ సేవా సమితి తరపున అరుణ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు. ముందుగా అరుణ్ ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు తోట భోగయ్య, నా మన మహేష్, కోమటి రాంబాబు, నందమూరి సుధాకర్, మారోజు గణేష్, శరత్, షేక్ ఖాన్, మద్దాల సత్యనారాయణ, అరుణ్ కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు

Related posts

రామోజీ రావు గారి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి

AR TELUGU NEWS

ఆంధ్రప్రదేశ్ లో మద్యం పాత బ్రాండ్లు అమ్మకాల గురు…

AR TELUGU NEWS

ఓటర్లకు వినూత్న రీతిలో ధన్యవాదాలు తెలిపిన దేవ వరప్రసాద్

AR TELUGU NEWS