మరోసారి దాతృత్వం చాటుకున్న కూటమి అభ్యర్థి బొలిశెట్టి.
వైఎస్ఆర్ సీపీ కార్యకర్తకు 10000 రూపాయలు ఆర్థిక సహాయం
తాడేపల్లిగూడెం మే 16: పశ్చిమగోదావరి జిల్లాతాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇంచార్జ్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. పోలింగ్ సమయంలో జువ్వలపాలెం కు చెందిన వైసీపీ కార్యకర్త జయప్రకాష్ పోలీసుల తోపులాటలో గాయపడ్డారు. తోపులాటలో కాలు విరిగిపోవడంతో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బొలిశెట్టి శ్రీనివాస్ జువ్వలపాలెం జన సైనికులతో సంప్రదించి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఎన్నికల వరకు మాత్రమే పార్టీలు, రాజకీయాలు అన్నారు. ఎన్నికల తర్వాత అందరూ ఒకటే అన్నారు. కష్టాల్లో ఉన్న వారికి ఎప్పుడూ తోడుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.