కూటమి తోనే అభివృద్ధి సాధ్యంపెనుగొండ, మే10: రాష్ట్రంలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపి కూటమి అభ్యర్థులను గెలిపిస్తేనే రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుందని అంటూ గురువారం పెనుగొండ మండలం, సిద్ధాంతంలో కూటమి నాయకులు ఇంటింటికి తిరుగుతూ కూటమి అభ్యర్థులు గెలిపించాలని ఓట్లను అభ్యర్థిస్తున్నారు. నక్కా వారిపాలెం, బూరుగు లంకలలో ఓటర్లకు ఈవీఎంలపై ఏ విధంగా ఓటు వేయాలో తెలియజేస్తూ, కూటమి మేనిఫెస్టోలో ఉన్న సంక్షేమ పథకాలను వివరించి, కూటమి అభ్యర్థులైన ఆచంట శాసనసభకు పోటీ చేస్తున్న పితాని సత్యనారాయణ సైకిల్ గుర్తుకు, అలాగే నరసాపురం పార్లమెంటు కు పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థి భూపతి రాజు శ్రీనివాస వర్మ కమలం గుర్తులు పై ఓట్లు వేసి గెలిపించాలని వాటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో తెదేపా, జనసేన, బిజెపి కూటమి నాయకులు పాల్గొన్నారు.

previous post