నరసాపురం మే 10 : బహుజన సమాజ్ పార్టీ తరుపున అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న బందెల రాజేంద్ర ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రచారంలో భాగంగా సీతారామపురం, పసలదివి, తంగెళ్ళమూడి, మెట్రేవు, తూర్పుతాళ్లు, పేరుపాలెం ప్రాంతాలలో ఇంటింటి ప్రచారం ఎండలను సైతం లెక్క చేయకుండా ఉద్రుతంగా కొనసాగుతూ గ్రామ గ్రామాన అద్భుతమైన ఆదరణ ప్రజలనుండి వ్యక్తం అవుతుంది.ప్రచారంలో బియస్పి సీనియర్ నాయకులు మనోహర్, బందెల బన్ను, శ్రీను,సంసోను,పాలపర్తి కిరణ్, రాహుల్, మాధవి,స్వర్ణలత బేబీ, లక్ష్మి, తేజ్శ్వని, కమల,కర్రీ సంతోష్, గణేష్, పాక గోపి తదితరులు పాల్గున్నారు…