సీఎం జగన్ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం…
అభివృద్ధి ,సంక్షేమాన్ని చూసి ఓటెయ్యండి..
రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్
భీమవరం మే 09 : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని అమలుచేసి, రాజకీయాలంటే ప్రజలలో విశ్వసనీయతను పెంచి ప్రతి కుటుంబం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో పరిశీలించి పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిన ఆయనతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. భీమవరం మండలంలోని గొల్లవానితిప్ప, దిరుసుమర్రు, యనమదుర్రు గ్రామాలలో ఆయన బుధవారం సాయంత్రం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబంలో ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా ఇంట్లో యజమాని రైతు అయితే రైతు భరోసా ద్వారా 13 వేల 500, డ్వాక్రా మహిళా గ్రూపు సభ్యురాలు అయితే రుణమాఫీ, సున్నా వడ్డీ, 40 నుంచి 60 సంవత్సరాలు దాటిన మహిళ అయితే ఏడాదికి 18 వేల750, విద్యార్థులకు అమ్మ ఒడి ద్వారా 15 వేలు, ఇంజనీరింగ్ చదివితే ఫీజు రియంబర్స్మెంట్, కుమారులు చేతివృత్తిదారులైతే ఆటోవాలాలు రజకులు నాయి బ్రాహ్మణులకు రూ పదివేలు, చేనేత కార్మికులకు రూ ఇరవై నాలుగు వేలు ఇలా అనేక సంక్షేమ పథకాలను ప్రజల కోసం ఆయన అమలు చేశారని అన్నారు. గత 58 నెలల పరిపాలన కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రక్క సంక్షేమాన్ని, మరో ప్రక్క అభివృద్ధిని చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. ఈ నేపథ్యంలో ఒంటరిగా పోటీ చేస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేమని భయపడ్డ చంద్రబాబు అన్ని పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, అయినప్పటికీ ప్రజలంతా కూడా అభివృద్ధికి సంక్షేమానికే అండగా ఉన్నారనే విషయం స్పష్టమైంది అన్నారు. రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు రెట్టింపు అవుతాయని ,అభివృద్ధి పెద్ద ఎత్తున జరుగుతుందని కాబట్టి ఈ నెల 13వ తేదీ జరగబోయే ఎన్నికలలో ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా గూడూరి ఉమాబాలను గెలిపించాలని ఆయన కోరారు.