తాడేపల్లిగూడెం మే 8 :ఈ మండు వేసవిలో వివిధ సెంటర్ల లొ ప్రజల దాహర్తిని తీర్చడానికి మజ్జగ చలివేంద్రాలను, మంచినీటి చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్న కమిటీలకు ఇచ్చే షామియానా సామాన్లుకు అద్దెలొ డిస్కౌంట్ ఇవ్వాలని తాడేపల్లిగూడెం షామియానా అసోసియేషన్ అధ్యక్షులు శిరంగుల నరసింహ మూర్తి సభ్యులకు విజ్ఞప్తి చేశారు. బుధవారం సాయంత్రం తాడేపల్లిగూడెం పట్టణం లోని టి టి డి కల్యాణ మండపం ఆవరణలో నెలవారీ సమావేశం నిర్వహించారు. ఈ వేసవిలో ఉష్ట్నోగ్రతలు బాగా పెరగడం వలన పిల్లలు, వృద్ధులు ఎండ బారినపడి వడదెబ్బ తగలకుండా చూసుకోవాలన్నారు.ఈనెల 13 వ తేది శాసనసభ మరియు లోకసభ ఎన్నికలు దృశ్యా ఓటు హక్కు వినియోగించు కొనుటకు ఉదయమే ఓటు వెయ్యడం వలన ఎండ బారినుండి తప్పించుకోవచ్చన్నారు. వేసవిలో ఎవరైనా వడదెబ్బ తగిలి మూర్ఛ పోయినపుడు వారిని నీడ ప్రాంతానికి తీసుకొని వచ్చి తగిన ఉపశమన చర్యలు చేపట్టాలన్నారు. సమావేశం అనంతరం నెలవారీ లక్కీ డ్రాలొ గెలుపొందిన సభ్యునికి బహుమతి అందచేశారు. ఈ సమావేశంలొ సంఘ గౌరవ అధ్యక్షులు పి వి వి సత్యనారాయణ, ఎమ్. వి. ఎస్. సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి కాళ్ల రవి, కోశాధికారి యాపాడ ప్రకాష్, ఎన్. సి హెచ్. శ్రీనివాస్, ఎస్. నరేంద్రరావు, జె. కె. కృష్ణ, పి. వి. రామకృష్ణ, ఆర్. సోమరాజు, ఇ. రమణ, ఎన్. నాగేశ్వరావు, సయ్యద్ చాన్ భాషా, బి. రామకృష్ణ, ఎమ్. బాలాజీ, ఏ. మురళి, పి. లక్ష్మీనారాయణ, కె. వి. నారాయణ, గట్టు సురేష్, బత్తిన శ్రీనివాస్, టి. నరేష్, కాటూరి సురేష్ బాబు, మన్యం రవికుమార్ తదితరులు పాల్గొన్నారు

previous post