మొగల్తూరు మే 08 : నర్సాపురం నియోజకవర్గం మొగల్తూరు పట్టణం ప్రైమరీ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ అఫ్ ఎ.పి బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్నా డాక్టర్ చినిమిల్లి సత్యన్నారాయణ మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి కోసం ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి బొమ్మిడి నాయకర్ గెలుపు కోసం అందరూ సమిష్టిగా పనిచేసి గెలుపు కోసం ఓటర్లను చైతన్యం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నర్సాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి పొత్తూరి రామరాజు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కొవ్వలి యతిరాజా రామ్మోహన్ నాయుడు, ఎన్డీయే కుటమి ఎమ్మెల్యే అభ్యర్ధి బొమ్మిడి నాయకర్, అబ్సర్వర్ బూరుగుపల్లి రాఘవ మొగల్తూరు మండల అధ్యక్షులు గుబ్బల నాగరాజు మరియు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.
