“కొట్టు నామినేషన్ కు వేలాది గా తరలి వెళ్లిన వైసీపీ నాయకులు” పెంటపాడు: పెంటపాడు గ్రామపంచాయతీ 11వ వార్డు కునాగరపేట నుండి వార్డు మెంబరు మారంపూడి ఏసుదాస్ ఆధ్వర్యంలో కొట్టు నామినేషన్కు వేలాదిగా తరలి వెళ్లారు. ముందుగా బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా వార్డు నుండి స్వచ్ఛందంగా వైసీపీ శ్రేణులు ,అభిమానులు, వైసీపీ కుటుంబ సభ్యులు వేలాదిగా తరలి వెళుతున్నామని తెలియజేశారు. వైసీపీ శ్రేణులు “కొట్టు నాయకత్వం వర్ధిల్లాలి” “జగనన్న నాయకత్వం వర్ధిల్లాలి” జై కొట్టు జై జై కొట్టు” అంటూ నినాదాలు చేసుకుంటూ కొట్టు నివాసం వరకు తరలి వెళ్లారు. జగనన్న నాయకత్వంలో ప్రతి కుటుంబంలో లబ్ధి చేకూర్చరని పార్టీలు, కులాల, మతాలు చూడకుండా అర్హత ఉన్న ప్రతి పేదవాడికి లబ్ధి చేకూర్చారని ఆయన తెలియజేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో జగనన్నకు పట్టం కట్టి కొట్టును గెలిపించుకుందామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొవ్వూరి ప్రసాదరెడ్డి, వైసీపీ మండల యువజన విభాగం అధ్యక్షులు కొవ్వూరి భాస్కర్ రెడ్డి, ఏ ఏం సి డైరెక్టర్ కర్రీ వరహాల రెడ్డి, ఉండ్రాజవరపు గోపి, గ్రామపంచాయతీ వైసీపీ సెక్రటరీ చదలవాడ శ్రీనివాస్, వైసీపీ సేవాదళ్ నాయకులు తానేటి కుమార్ రాజా, చదలవాడ ఆశీర్వాదం, దూలపల్లి నేతి రాజు, సొసైటీ డైరెక్టర్ నల్లిమిల్లి ప్రభాకర్ రెడ్డి, నల్లిమిల్లి అప్పిరెడ్డి, కళింగ పెద్ద లక్ష్మణరావు, తానేటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

previous post