March 9, 2025
Artelugunews.in | Telugu News App
ఇతర రాష్ట్రాలుపాలిటిక్స్

ఉచితాలకు నేను వ్యతిరేకం

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

ఢిల్లీ : ప్రభుత్వ ఉచిత పథకాలు, పార్టీ ఫిరాయింపులపై వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఉచితాలకు తాను వ్యతిరేకమని ప్రకటించారు.కొన్ని పార్టీలు ఇష్టారాజ్యంగా హామీలు ఇస్తున్నాయని, ప్రజలకు విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వండి తప్పులేదు.. కానీ ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసే ఉచితాలు కరెక్ట్‌ కాదని.. ఇచ్చిన ఉచిత హమీలు అమలు చేయడం కోసం మళ్లీ అప్పులు చేయడం సరికాదని హితవు పలికారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడుతూ..ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరొక పార్టీలోకి వెళ్లడం ఇటీవల రాజకీయ నాయకులకు ట్రెండ్‌గా మారిందన్నారు.. పార్టీ మారాలనుకునే నేతలు వాళ్ల పదవికి రాజీనామా చేసి ఏ పార్టీలో అయినా చేరవచ్చన్నారు. పదవికి రాజీనామాకు చేయకుండా పార్టీ ఫిరాయించి నేతలపై విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు. అసభ్యంగా మాట్లాడేవారిని, అవినీతిపరులను ప్రజలు తిరస్కరించాలని పిలుపునిచ్చారు.

Related posts

జబ్బలు సరిసిందెవరు …బొమ్మ గడియారాలు ఇచ్చింది ఎవరు…!కల్లూరు సభలో స్థానిక నేతలపై కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు

AR TELUGU NEWS

ఓటర్లకు వినూత్న రీతిలో ధన్యవాదాలు తెలిపిన దేవ వరప్రసాద్

AR TELUGU NEWS

తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి అధికారంతోనే రాష్ట్రాభివృద్ధి సంక్షేమం

AR TELUGU NEWS