అల్లూరి జిల్లా, దేవీపట్నం,
ఆదివాసి కమ్యూనిటీ భవనం 0.05 సెంట్లు నిర్మాణానికి పర్మిషన్ ఇప్పించుట కొరకు దేవీపట్నం తాసిల్దార్ కె.సత్యనారాయణకు వినతిపత్రం ఇచ్చామని ఆదివాసి జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ఆదివాసి జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ మాట్లాడుతూ…అల్లూరి సీతారామరాజు జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం,దేవీపట్నం మండలం,ఇందుకూరు గ్రామపంచాయతీ పరిధిలోని దేవీపట్నం తాసిల్దార్ కార్యాలయంలో దేవీపట్నం తాసిల్దార్ కె.సత్యనారాయణ కు ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసీ నాయకులు ఆధ్వర్యంలో దేవీపట్నం మండలం,ఇందుకూరుపేట గ్రామంలో ఉన్న స్ర్తీశక్తి భవనం పక్కనున్న 0.05 సెంట్లు గ్రామ కంఠం, ప్రభుత్వ భూమిలో ఆదివాసి కమ్యూనిటీ భవనం నిర్మించుకొనుటకు పర్మిషన్ ఇప్పించగలరని వినతి పత్రం అందజేశాము.ఈ విషయంపై గతంలో దేవీపట్నం తాసిల్దార్ వారికి,రంపచోడవరం సబ్ కలెక్టర్ వారికి,ఐటిడిఏ పి.ఓ వారికి మరియు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ వారికి వినతి పత్రాలు ద్వారా తెలియజేయడంతో అప్పటి సబ్ కలెక్టర్ కట్టా సింహాచలం ఐఏఎస్ రంపచోడవరం వారు తేదీ:6.09.2022 సంవత్సరంలో స్పందించి ఏడు మండలాల్లోని మండల కేంద్రాల్లో ఆదివాసి కమ్యూనిటీ భవనాలు నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశారని తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదివాసి జేఏసీ నాయకులు దేవీపట్నం తాసిల్దార్ కె.సత్యనారాయణకు ఇందుకూరుపేటలో ఉన్న స్త్రీ శక్తి భవనం పక్కన ఆదివాసి కమ్యూనిటీ భవన నిర్మాణానికి పర్మిషన్ కొరకు వినతి పత్రం అందజేశామన్నారు.ఈ విషయంపై దేవిపట్నం తాసిల్దార్ కె.సత్యనారాయణ సానుకూలంగా స్పందించారన్నారు.రంపచోడవరం నియోజకవర్గం లో ఉన్న ఏడు మండలాల్లో ఆదివాసి కమ్యూనిటీ భవనాల నిర్మాణం,స్థలం సేకరణ కోసం స్పందించిన అధికారులకు ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ ఏపీ ఆదివాసి జేఏసీ నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసి జేఏసీ దేవీపట్నం మండల కార్యదర్శి యలగాడ నాగేశ్వరరావు,ఆదివాసి జేఏసీ రాష్ట్ర కార్యదర్శి కారం రామన్న దొర మొదలైనవారు పాల్గొన్నరన్నారు.