పశ్చిమగోదావరి జిల్లా, గణపవరం మండలం పిప్పర అక్టోబర్ 30 : అందరు బావుండాలి అందులో నేనుండాలి అనీ లక్ష్యం తో, అతి సామాన్యుడైన పిప్పర గ్రామానికి చెందిన, కొలనువాడ సుబ్బరాజు, బుధవారం ఆయన పుట్టిన రోజు సందర్భం గా, పిప్పర లో వృధులకు పళ్ళు దుప్పట్లు, నగదు కవర్లు అంద జేసి స్వీట్ల పంచారు. అలాగే కార్తకమాసం ఆధ్యాత్మక సేవా కార్యక్రమాలలో కూడా నేనున్నానంటూ ప్రతి ఏటా , సామూహిక సత్యదేవుని వ్రతాలు, దీపోత్సవం గ్రామంలో అందరికి అనసమా రాధన, కులాలకు, మతాలకు – రాజకీయాలకు అతీతంగా సేవలు అందిస్తూ “అందరివాడు” అనిపించుకుంటున్న డు. అంతేకాకుండా తన సొంత గ్రామం అయినటువంటి పిప్పర గ్రామంలో కుల మతాలకు అతీతంగా బలహీనవర్గాలలో ఎవరు మరణించిన అంత్యక్రియలు నిమిత్తం 2500 రూపాయలు ఆర్థిక సాయం చేస్తానని తన పుట్టినరోజు రోజున ప్రకటించడంతో పిప్పర గ్రామంలో ఉన్న ప్రజలుహార్షం వ్యక్తం చేశారు. సుబ్బరాజును సంపన్నులు ఆదర్శంగా తీసుకోవాలని, నిండు నూరేళ్ళు ఆ భగవంతుని ఆశీస్సులు వుండాలని ప్రజలు కోరుతున్నారు..