ఆదివాసీ ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించాలని,షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామకాల చట్టం చేయాలని ఐటీడీఏ పీవో కు వినతి పత్రం ఇచ్చిన ఆదివాసి జేఏసీ నాయకులు,
ఆల్లూరి జిల్లా, రంపచోడవరం,
అక్టోబర్ 28.
ఆదివాసీ ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించాలని,జీఓ నెం.3 చట్టం చేయాలని,లేదా షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామకాల చట్టం తక్షణమే ప్రకటించాలని మొదలైన సమస్యలపై రంపచోడవరం ఐటీడీఏ పీఓ కట్టా సింహాచలం కు వినతి పత్రం అందజేశామని ఆదివాసి జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆదివాసి జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ మాట్లాడుతూ…అల్లూరి సీతారామరాజు జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం,ఐటీడీఏ పీఓ కట్టా సింహాచలం కు (1) ఆదివాసి ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించాలని,(2)జీఓ నెం.3 చట్టం చేయాలని లేదా షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామకాల చట్టం తక్షణమే ప్రకటించాలని (3) 2024 మెగా డీఎస్సీ లో ఏజెన్సీ ఉపాధ్యాయ పోస్టులపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలని (4) పీసా గ్రామ సభ ఎన్నికలు తక్షణమే నిర్వహించాలని (5) దేవీ పట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు శాశ్వత భవనాలు మంజూరు చేయాలని (6) దేవీ పట్నం మండలంలోని చిన్నారి గండి గ్రామం వరకు మూడు పూట్ల వచ్చే విధంగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని (7) కొండ పోడు పట్టాలు ఇచ్చిన వారికి భూములు రీ సర్వే చేసి అప్పగించాలని,దివ్యాంగులకు ఉచితంగా చేవి,కాళ్ళు మరియు ట్రై సైకిల్స్ మొదలైనవి పంపిణీ చేయాలని మొదలైన సమస్యల పై వినతి పత్రం అందజేశామని తెలిపారు.పై సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసి జేఏసీ రాష్ట్ర కార్యదర్శి కారం రామన్న దొర,ఆదివాసి జేఏసీ దేవీ పట్నం మండల కార్యదర్శి యలగాడ నాగేశ్వర రావు మరియు ఆదివాసి నిరుద్యోగ పట్టా భద్రులు మొదలైన వారు హాజరయ్యారన్నారు.