బీమవరం: అక్టోబర్ 13,2024.
*అక్టోబర్ 14 నుండి 20 వరకు జిల్లాలో పండుగ వాతావరణంలో పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.*
ఈనెల 14 నుండి 20 వరకు జిల్లాలో గ్రామ స్థాయిలో నిర్వహించే పల్లె పండగ పంచాయతీ వారోత్సవాలు సంబంధిత శాఖల అధికారులు సమన్వయం చేసుకొని జిల్లా లో విజయవంతంగా నిర్వహించాలన్నారు. జిల్లాలో 423 పనులను రూ.51.03 కోట్ల వ్యయంతో చేపట్టనున్నట్లు తెలిపారు. వీటిలో 351 సిసి రోడ్లు రూ.41.94 కోట్లు, 5 బీటీ రోడ్స్ రూ.2.46 కోట్లు, 67 సీసీ డ్రైన్స్ రూ.6.63 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి పంచాయతీ పరిధిలో ఈ సంవత్సరములో చేసే అభివృద్ధి పనులకు సంబంధించి ఆ గ్రామం లో బోర్డు ఏర్పాటు చేయాలని సంబందించిన అధికారులను ఆదేశించారు. గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీ రాజ్ శాఖల ద్వారా గ్రామస్థాయిలో వందకు వంద శాతం పనులు పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. పంచాయతి సెక్రటరీలు ఉపాధి హామీ పథకం ద్వారా చేప్పట్టే పనులను పూర్తిచేయాలని, పంచాయతీ సెక్రటరీలు ముందుగానే గ్రామ స్థాయిలో నిర్వహించే పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాల నిర్వహణకు సంబంధించి టామ్ టామ్ వేయించాలన్నారు. భూమి పూజ చేసే వాటికి సంబంధించి పంచాయతీల్లో ప్రచారం చేయాలని, పంచాయతీ పరిధిలో చేసే అభివృద్ధి కార్యక్రమాలు, భూమి పూజ వంటి కార్యక్రమాల పూర్తి వివరాలను ప్రజా ప్రతినిధులకు ముందుగానే తెలియజేయాలని పంచాయతీ సెక్రెటరీలకు సూచించారు. పంచాయతీరాజ్, నీటి సరఫరా శాఖల ద్వారా పంచాయతీ పరిదిలో మంజూరు చేసిన పనులను గ్రామలలో గ్రౌండింగ్ కు సంబంధించి పంచాయతి సెక్రటరీలు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. పంచాయతీ పరిధిలో ఎక్కడెక్కడ ఏఏ పనులు చేసి, వాటికి సంబంధించి ఎప్పుడు పూర్తి చేస్తారన్న పూర్తి వివరాలను గ్రామ సభలో ప్రజలకు తెలియజేసే విధంగా బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామపంచాయతీలు వారీగా మంజూరైన పనుల జాబితాను మండలాలకు తెలియజేయడం, మండలాల వారీగా గ్రౌండింగ్ (భూమి పూజ) కోసం గ్రామపంచాయతీలు వారీగా తేదీల వారీగా రోడ్ మ్యాప్ షెడ్యూల్‌ను అమలు చేయాలన్నారు. భూమి పూజ కోసం ప్రతిపాదించబడిన మంజూరు చేయబడిన పనులు, పనుల అప్‌లోడ్ చేయడం గ్రామపంచాయతీ కార్యదర్శుల ద్వారా *పి ఆర్ వన్ యాప్* లో అప్‌లోడ్ చేయాలని తెలిపారు.
………………………………………………
….
జిల్లా సమాచారం శాఖ, భీమవరం నుండి జారీ చేయడమైనది